వరుణ్ ఆ బ్యానర్ లో మరో సినిమా చేయనున్నాడా?

0

మెగా హీరో వరుణ్ తేజ్ కు గద్దలకొండ గణేష్ చిత్రం తర్వాత అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఒక సినిమాలో వరుణ్ నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా సగం పూర్తి అయినట్లగా సమాచారం అందుతోంది. త్వరలో ఆ సినిమాను ముగించేయనున్నాడు. ఈ సమయంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ 14 రీల్స్ బ్యానర్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సాగర్ చంద్ర ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

గద్దలకొండ గణేష్ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో వరుణ్ నటించేందుకు ఆ సమయంలోనే అడ్వాన్స్ తీసుకున్నాడు. కనుక ఇప్పుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్ మూవీ ఉంటుందని అంటున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయని బాక్సింగ్ మూవీ పూర్తి అయిన తర్వాత వరుణ్ ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు 14 రీల్స్ నుండి కాని వరుణ్ నుండి కాని క్లారిటీ లేదు.

ప్రస్తుత సమయంలో షూటింగ్ లు లేని కారణంగా హీరోలు కథలు వింటున్నారు. అలాగే వరుణ్ తేజ్ కూడా పలువురి కథలు విన్నాడు. సాగర్ చెప్పిన కథ పట్ల వరుణ్ పాజిటివ్ గా స్పందించాడని అంటున్నారు. సినిమా ఫైనల్ అయ్యిందా లేదా అనే విషయంలో మరికొన్ని రోజుల్లో యూనిట్ సభ్యుల నుండి స్పందన వచ్చే అవకాశం ఉందంటున్నారు. వరుణ్ బాక్సింగ్ మూవీని సెప్టెంబర్ నుండి పునః ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది.