ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ అనౌన్స్ చేసిన ‘రాధే శ్యామ్’ టీమ్…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధేశ్యామ్”. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణా మూవీస్ – టీ సిరీస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్.. ఇటలీలో తిరిగి ప్రారభమైంది. ఈ అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ‘రాధేశ్యామ్’ నుంచి ఏదేమైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ అనౌన్స్ చేసిన మూడు సినిమాల్లో ‘రాధేశ్యామ్’ ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది కాబట్టి టీజర్ లేదా మోషన్ పోస్టర్ రావొచ్చని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే ‘రాధే శ్యామ్’ టీమ్ డార్లింగ్ బర్త్ డే గిఫ్ట్ అనౌన్స్ చేసింది.

అక్టోబర్ 23న ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో ఈ చిత్రం నుంచి ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ఈ సర్ప్రైస్ సంగీతం పరంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. అదే రోజు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఇప్పటికే రిలీజైన చిత్ర ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి దాదాపు 140 కోట్లకి పైగా ఖర్చు అయిందట. సినిమా పూర్తయ్యే లోపు మరో 30 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందట. భారీ సెట్టింగ్స్ తోనే ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ అందుకున్న రిజల్ట్ ని బట్టి ‘రాధేశ్యామ్’ మూవీ ఏ మేరకు బిజినెస్ చేస్తుందో చూడాలి.