కీర్తి సురేష్ బర్త్ డే కానుకగా ‘రంగ్ దే’ నుంచి న్యూ పోస్టర్…!

0

యూత్ స్టార్ నితిన్ – ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”రంగ్ దే”. నేడు(అక్టోబర్ 17) హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సంధర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘రంగ్ దే’ నుంచి కీర్తి కి సంబంధించిన ఓ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఫొటోలో చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో ఉన్న కీర్తి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవలే కొద్ది విరామం తరువాత చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లు నితిన్ – కీర్తి సురేష్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన మరికొన్ని సన్నివేశాలు మరియు ఇటలీలో పాటల చిత్రీకరణతో కొద్ది రోజులలోనే షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు.

కాగా నితిన్ – కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్.వెంకటరత్నం(వెంకట్) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ‘తొలిప్రేమ’ ‘మిస్టర్ మజ్ను’ వంటి ప్రేమకథా చిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ‘రంగ్ దే’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ – వినీత్ – రోహిణి – కౌసల్య – బ్రహ్మాజీ -వెన్నెల కిషోర్ – సత్యం రాజేష్ – అభినవ్ గోమటం – సుహాస్ – గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.