`రాధేశ్యామ్` బృందం అప్పుడే హైదరాబాద్ కి..?

0

షూటింగ్ ఇలా ప్రారంభించారో లేదో అలా షార్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమవుతోంది రాధే శ్యామ్ టీమ్. ప్రభాస్- పూజా హెగ్డే సహా రాధే శ్యామ్ ఇటలీలో దాదాపు 3 వారాలుగా క్యాంప్ చేసిన సంగతి తెలిసినదే. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాధతో శ్యామ్ రొమాన్స్ కి సంబంధించిన ప్యూర్ లవ్ స్టోరి ఇది. ఇటలీ లొకేషన్లలో షెడ్యూల్ మూవీకి ప్రత్యేక గ్లామర్ తేనుందని సమాచారం.

తాజా సమాచారం ప్రకారం.. ఈ వారాంతంలో రాధే శ్యామ్ ఇటలీ షెడ్యూల్ ముగుస్తుంది. కొన్ని రోజుల్లో యూనిట్ హైదరాబాద్ కి తిరిగి వస్తుంది. ఈ షెడ్యూల్ ముగిసే సమయానికి మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తవుతుంది. కొద్దిరోజుల గ్యాప్ తరువాత యూనిట్ మళ్లీ హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభిస్తుంది. అన్ లాక్ తర్వాత శరవేగంగా ఈ సినిమాని పూర్తి చేస్తుండడం ఆసక్తికరం.

వెటరన్ స్టార్ కృష్ణరాజుకి చెందిన గోపికృష్ణ మూవీస్- యువి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ త్రిభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మునుముందు రాధేశ్యామ్ టీజర్.. ట్రైలర్ .. సింగిల్స్ తో హీట్ మరింతగా పెంచేస్తారేమో చూడాలి.