ఈసారి అరియానా గ్రాఫ్ పడిపోతూ ఉంది

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో ఉన్న కంటెస్టెంట్స్ చిత్రీ విచిత్రంగా కనిపిస్తున్నారు. వారు ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సార్లు వారిని చూస్తే వావ్ ఇంత మంచి వారికి సపోర్ట్ చేయాలి అన్నట్లుగా అనిపిస్తుంది. వారినే కొన్ని సందర్బాల్లో చూస్తే అబ్బే ఇన్ని రోజులు వీరికి ఎలా వేశాం అనిపిస్తుంది. అలా హౌస్ లోని ప్రతి ఒక్కరు కూడా తమపై అభిమానులకు ఉన్న అభిప్రాయంను మార్చేసుకుంటున్నారు. ఈ వారం ఒకరు పర్వాలేదు అనుకుంటే తదుపరి వారం వారి విషయంలోనే ప్రేక్షకులు విసుగు పడే పరిస్థితి వస్తుంది.

మొదటి రెండు వారాలు ఈ పిల్ల ఏంట్రా బాబోయ్ అనిపించిన అరియానా మూడవ వారం నుండి గత వారం వరకు బలమైన కంటెస్టెంట్ అనిపించింది. ఆమె ఫిజికల్ టాస్క్ లు మరియు ఇతర టాస్క్ లు అన్నింట్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. గేమ్ పై చాలా ఫోకస్ తో ఉంది అనిపించింది. కాని ఈ వారంలో ఆమె ప్రవర్తన ఏమాత్రం సరిగా లేదు. ఆమె పదే పదే గొడవ పడటం. చిన్న విషయాలకు అవతలి వారిపై అరవడం చేస్తుంది. అవతలి వారు మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా ఆసక్తి చూపించకుండా అక్కడ నుండి వెళ్లి పోవడం చేస్తుంది. దాంతో ఆమెపై ఇన్ని రోజులు ఉన్న అభిప్రాయం తగ్గి పోతుంది.

మొన్నటి వరకు అరియానా టాప్ 5 లో ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కాని ఈ వారం సేవ్ అయినా రాబోయే రెండు మూడు వారాల్లోనే ఆమె బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికి అయినా అరియానా కాస్త అతి తగ్గించుకుని తాను ఎలా ఉంటుందో అలాగే ఉంటే మళ్లీ అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అలా కాదంటే ఆమెకు ఎలిమినేషన్ తప్పదు అనిపిస్తుందంటూ బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.