Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘రాధేశ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్..?

‘రాధేశ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్..?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్.’ ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఒకటీ అరా లుక్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ గా.. టీజర్ రిలీజ్ అవుతుందని ప్రచారం సాగుతుండడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఈ కొత్త సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా ఉన్న ఫ్యాన్స్.. టీజర్ రిలీజ్ పై రచ్చ చేస్తున్నారు. టీజర్ త్వరలోనే వస్తోంది అన్నట్టుగా దర్శకుడు రాధా కృష్ణ కూడా ఇవాళ పొద్దున్నే హింట్ ఇచ్చారు. దీంతో.. మోస్ట్ అవైటెడ్ రాధే శ్యామ్ టీజర్ కొత్త సంవత్సరం రోజునే వస్తోందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే.. లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ టీజర్ ను సంక్రాంతి కానుకగా వదలనున్నట్టు తెలుస్తోంది. జనవరి 14న ఈ టీజర్ ను రిలీజ్ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది చూడాలి.

ఇక ఈ భారీ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ స్వచ్ఛమైన ప్రేమ కావ్యాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.