డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నాని హీరోయిన్?

0

బాలీవుడ్.. టాలీవుడ్.. శాండిల్ వుడ్ ఇలా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం డ్రగ్స్ టాపిక్ నడుస్తోంది. బాలీవుడ్ నటి రియా కు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత అధికారులు ఆమెను ఇప్పటికే ప్రశ్నించడంతో పాటు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో కూడా డ్రగ్స్ కల్చర్ ఉంది అంటూ మాధవి లత ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్ రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది.

కన్నడంతో పాటు తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈమె నానికి జోడీగా జెండాపై కపిరాజు అనే సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ టాలీవుడ్ లో ఆమె కనిపించలేదు. ఈమద్య కాలంలో వరుసగా కన్నడ సినిమాల్లోనే నటిస్తున్న ఆమె అనూహ్యంగా డ్రగ్స్ కేసులో నింధితురాలిగా అరెస్ట్ అవ్వడం కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యింది.

ఇటీవల డ్రగ్స్ రాకెట్ లో పట్టుబడ్డ ఇద్దరు రాగిణి ద్వివేది మరియు సంజన పేర్లను చెప్పారట. దాంతో ఇద్దరిని విచారించేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. విచారణకు ప్రస్తుతం హాజరు అయ్యేందుకు సిద్దంగా లేనని సోమవారం నాడు తాను విచారణకు హాజరు అవుతాను అంటూ రాగిణి చెప్పుకొచ్చింది. కాని పోలీసులు మాత్రం వెంటనే విచారణకు హాజరు కావాలంటూ మళ్లీ నోటీసులు ఇవ్వగా స్పందించక పోవడంతో నేడు తెల్లవారు జామున ఆమె ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ మొదలు పెట్టారు. ఈ కేసులో సంజన కూడా విచారణ ఎదుర్కొంటుంది.