Templates by BIGtheme NET
Home >> Cinema News >> రాగిణి సంజన ఆస్తులు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

రాగిణి సంజన ఆస్తులు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!


బెంగళూరు డ్రగ్స్ కేసులో రోజుకో మలుపు తిరుగుతూ క్రైం థ్రిల్లర్ను తలపిస్తోంది. అయితే ఈ కేసును విచారిస్తున్న సీసీబీ అధికారులకు కొన్ని షాకింగ్ తెలిశాయట. డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనీ తారలు రాగిణి ద్వివేది సంజనా గల్రానీ బెంగళూరు ఇతర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారట. అయితే సాధారణ నటీమణులుగా కొనసాగుతున్న వీరికి ఇంతమేర ఆస్తులు ఎలా వచ్చాయని సీసీబీ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో వీరిద్దరూ అనేకమంది పేర్లను బయటపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. వీరిద్దరూ ఎంత కాలంగా డ్రగ్స్ తీసుకుంటున్నారన్న కచ్చితమైన సమాచారం సేకరించేందుకు సీసీబీ అధికారులు వారి తల వెంట్రుకలు రక్తం సేకరించి ల్యాబ్ కు పంపించారు. 92 రోజుల ముందు డ్రగ్స్ తీసుకున్నా ఈ పరీక్ష లో తేలుతుంది. అయితే శాంపిల్స్ ఇచ్చేందుకు ముందుగా ఇద్దరు హీరోయిన్లు నిరాకరించారట. ఓ దశలో సిబ్బంది తో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.

ఆస్తులు వివరాలు చూసి షాక్..

తనకు బెంగళూరులో 10 ప్లాట్లు ఉన్నట్టు సంజన అధికారులకు చెప్పారు. వీటి విలువ మొత్తం కలిపితే రూ. వందలకోట్లు ఉంటుంది. అయితే తక్కువ సినిమాల్లో చేసిన సంజన ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించిందని అధికారులు షాక్ గురయ్యారట. మరో వైపు రాగిణి కి కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపి ప్రముఖులకు డ్రగ్స్ విక్రయించడం వల్లే ఈ స్థాయిలో డబ్బులు సంజన డబ్బు సంపాదించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

తెలియదు ఇరికించారు

రాగిణి సంజనాను సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ ప్రత్యేకంగా విచారించారు. వీళ్లద్దరూ విచారణకు సహకరించటం లేదట. అన్ని ప్రశ్నలకు తెలియదు మమ్మల్ని అనవసరంగా ఇరికించారు అంటూ బదులిచ్చినట్టు టాక్. వీరు కర్ణాటక కు చెందిన పలువురు రాజకీయ సినీ రంగాల ప్రముఖుల పేర్లు సీసీబీకి చెప్పినట్టు కొన్ని కన్నడ వార్తాసంస్థలు వెల్లడించాయి. కాగా ఇదే కేసులో కీలకనిందితుడైన ప్రతీక్ శెట్టి ని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు షేక్ ఫైజల్ ఆదిత్య ఆళ్వ పరారీ లో ఉన్నారు.

బెయిల్ పిటిషన్ కొట్టివేత

రాగిన్ ద్వివేది సంజన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను సీసీహెచ్ కోర్టు కోట్టేసింది. సోమవారం వరకు వీరిని కస్టడీకి అప్పగించింది. డ్రగ్స్ కేసు లో ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించామని.. వీరు విచారణకు సహకరించడం లేదని సీసీబీ అధికారులు కోర్టు లో వాదించారు. వారి వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.