సమంత లేజీగా ఒక రోజు ఇలా

0

సోషల్ మీడియాల్లో అక్కినేని కోడలు సమంత స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సామ్ రెగ్యులర్ ఫోటో ట్రీట్ వీడియో ట్రీట్ కి ఫాలోయింగ్ అసాధారణం. టాలీవుడ్ వరకూ ఫ్యాషనిస్టా అంటే సమంత గురించే చెబుతారు. అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ రేంజులో సరికొత్త ట్రెండీ స్టైలింగ్ ఫ్యాషన్స్ తో అలరించడం తనకు మాత్రమే చెల్లింది ఇక్కడ.

తాజాగా మరోసారి స్టైల్ స్టేట్ మెంట్ తో తన ఇన్ స్టా ఫాలోవర్స్ లోకి దూసుకుపోయింది. ఈసారి అక్కినేని కోడలు పోయెట్రీ మరింత ఆసక్తికరంగా ఉంది. “వడపోత లేకుండా మచ్చలేని అనుభూతి.. మీ స్వంత మాయానుభూతి… మీ శరీర కాంతిపై విశ్వాసంగా.. నిజంగా మీలాంటి ఇంకొకరు ఎవరూ లేరు“.. అంటూ బెడ్ పై లేజీగా రిలాక్స్ డ్ గా సెల్ఫీ దిగి పోస్టింగ్ చేసిందిలా. తనతో పాటే తన ఫేవరెట్ పెట్ డాగ్ ఆ బెడ్ పై రిలాక్సవుతుండడం కనిపిస్తోంది.

సామ్ సింపుల్ టాప్ .. బ్లాక్ ఫ్యాంట్ ధరించి కనిపించింది. అన్నట్టు లాక్ డౌన్ అయిపోయి అన్ లాక్ 4.0 వరకూ వచ్చినా ఇంకా సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానే లేదు. బహుశా దసరా నాటికి కానీ అది రెడీ కాదు. అలాగే సమంత నటిస్తున్న ప్రస్తుత సినిమాకి నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా తాజా షెడ్యూల్ అప్ డేట్ తెలియాల్సి ఉంది.