బిబి4 : ఎలిమినేషన్ లో ఉన్నవారి బలాలు బలహీనతలు

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారం పూర్తి కాబోతుంది. నేడు రేపు వీకెండ్ ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్ డ్రామా ఉండబోతుంది. మొదటి వారంలో మొత్తం 14 మందిలో సగం మంది ఏడుగురు నామినేషన్ అయ్యారు. సోహెల్ అరియానా ఆలస్యంగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు కనుక వారు ఎలిమినేషన్ నామినేషన్ నుండి తప్పించుకున్నారు. మొదటి వారంలో ఎలిమినేషన్ లో సూర్య కిరణ్.. అభిజిత్.. గంగవ్వ.. సుజాత.. దివి.. మెహబూబ్.. అఖిల్ సర్తక్ ఉన్నారు. వీరిలో గంగవ్వకు అత్యధికంగా ఓట్లు నమోదు అవుతున్నట్లుగా ట్రెండ్స్ ను బట్టి అర్థం అవుతుంది.

ఎలిమినేషన్ లో ఉన్న ఏడుగురిలో గంగవ్వకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఆమె ఇంకొన్నాళ్లు ఇంట్లో ఉండాలనే అభిప్రాయం అందరికి ఉంది. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఆమె బలంగా చెప్పుకోవచ్చు. ఇక అభిజిత్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. హీరో కనుక అతడు కొన్నాళ్ల పాటు ఉంటాడు. అదే అతడి బలంగా చెప్పుకోవచ్చు. మోడల్ కమ్ నటి అయిన దివి అనూహ్యంగా క్రేజ్ దక్కించుకుంది. ఆమె అవసరం ఉన్న చోట మాట్లాడుతూ తన పని తాను చేసుకు వెళ్తుంది. అదే ఆమె బలం. సుజాత విషయంలో ప్రేక్షకులు కాస్త ఓవర్ యాక్షన్ గా ఫీల్ అవుతున్నారు. అది ఆమె బలహీనత. సూర్య కిరణ్ అందరిని డామినేట్ చేసేందుకు డైరెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అది ఆయనకు బలహీనత అవ్వబోతుంది.

మిగిలిన అఖిల్.. మెహబూబ్ ల విషయంలో కొందరు పాజిటివ్ తో ఉన్నారు కొందరు నెగటివ్ గా ఉన్నారు. కాని వీరిద్దరికి సాయి కిరణ్ సుజాతలకు ఉన్నంత వ్యతిరేకత లేదు. కనుక ఈ వారం ఏడుగురిలో సాయి కిరణ్ మరియు సుజాతలు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అయితే ఆశ్చర్యం లేదు. వీరు కాకుండా మరెవ్వరైనా ఎలిమినేట్ అయితే మాత్రం పక్కాగా షో పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అది సంచలనం అవ్వబోతుంది. నేడు ముగ్గురిని సేవ్ చేసి రేపటి ఎపిసోడ్ లో మరో ముగ్గురిని సేవ్ చేసి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయంను నాగార్జున ప్రకటించే అవకాశం ఉంది.