Templates by BIGtheme NET
Home >> Cinema News >> నేను యోధుడిగా మారాలనుకుంటున్న : రాజమౌళి

నేను యోధుడిగా మారాలనుకుంటున్న : రాజమౌళి


రాజమౌళి కుటుంబ సభ్యులు ఇటీవలే కరోనాను జయించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్లాస్మా దానం చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్లాస్మా దానం గురించి సీపీ సజ్జనార్ చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం అన్నారు. పోలీసుల డ్యూటీలో పార్ట్ కాకున్నా కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి వాలంటీర్లను ఆహ్వానించి ప్లాస్మా డొనేషన్ ను ప్రోత్సహిస్తున్నారు. వారు నిజంగా రక్షక భటుల్లా మారారు. ఒక్కరు ఇద్దరితో మొదలైన ఈ కార్యక్రమం ప్రస్తుతం రోజుకు 70 నుండి 80 మంది వరకు ప్లాస్మా దానం చేసే వరకు తీసుకు వచ్చారు.

ప్లాస్మా దానం చేయడంపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కరోనాతో బాధపడుతున్న వారికి ప్లాస్మా అనేది బ్రహ్మాస్త్రంగా పని చేస్తుంది. అందుకే ప్లాస్మాను దానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. ప్లాస్మా దానం చేసిన వారు నిజమైన హీరోలు. మేము ప్రతి రోజు వెండి తెరపై ఎంతో మంది హీరోలను చూస్తాం. కాని రియల్ హీరోలు అంటే మీరే. మీరు చేస్తున్న దానంతో ఒక ప్రాణం నిలుస్తుంది. అందుకే మీరు అంతా కూడా యోధులు అంటూ ప్లాస్మా డోనర్స్ ను రాజమౌళి అభినందించారు.

త్వరలో నేను కూడా ప్లాస్మా దానం చేసి ఒక యోధుడిగా మారాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్లాస్మా దానం అనేది రక్త దానం మాదిరిగానే ప్లాస్మా తీసినంత మాత్రాన ఏమీ కాదు. మళ్లీ కొత్త ప్లాస్మా వస్తుంది. ఇక ప్లాస్మా ఇచ్చేందుకు వెళ్లిన చోట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. అక్కడకు వెళ్తే మళ్లీ కరోనా బారిన పడాల్సి వస్తుందేమో అని కొందరు భయపడుతున్నారు. అలాంటి ఆందోళన ఏమీ అక్కర్లేదు. చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ వారు మీ నుండి ప్లాస్మా తీసుకుంటారు. తల్లిదండ్రులు ఎవరు కూడా ప్లాస్మా దానంను వ్యతిరేకించకండి. ప్లాస్మా దానం చేయడం వల్ల రియల్ హీరోలుగా మిగులుతారు అంటూ రాజమౌళి అన్నారు.