రజినీ.. మీ ఇష్టం.. ఏం చేస్తే అది చేయండి

0

తమిళనాడు రాజకీయాల్లోకి రజినీకాంత్ వస్తాడా? రాడా? అన్నదే ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న. అయితే ఇటీవల తాను రాజకీయాల్లోకి రాలేనంటూ రజినీకాంత్ పేరుతో వెలువడిన ఒక లెటర్ వైరల్ అయ్యింది.

దీనిపై వివరణ ఇచ్చిన రజినీకాంత్.. ఆ లెటర్ నాది కాదని స్పష్టం చేశారు.అయితే తన ఆరోగ్యానికి సంబంధించి అందులో ఉన్న సారాంశం మాత్రం వాస్తవం అని బాంబు పేల్చారు.

దీంతో రజినీకాంత్ కు కిడ్నీ మార్పడి జరిగిందనే విషయం అభిమానులతోపాటు పలువురు ప్రముఖులకు కూడా షాకిచ్చింది. కిడ్నీ మార్పడి అనేది చాలా క్లిష్టమైన సమస్య. అది చేసుకుంటే బయట ఏం పనిచేయడానికి ఉండదు. సరిగ్గా సెట్ కాకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటికే సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీ లాంటి వారు కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే రజినీకాంత్ రిస్క్ చేసి ఇప్పుడు రాజకీయాల్లోకి రావద్దనే డిమాండ్ పెరిగిపోయింది.

తాజాగా సీనియర్ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ప్రియమైన రజినీకాంత్ గారు.. మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం. అంతకుమించి ఏది లేదు. వజ్రం లాంటింది మీ మనసు. నిండు నూరేళ్లు మీరు జీవించాలి. అందుకు మీరు ఏం చేయాలంటే అది చేయండి. మీపై మాకు ప్రేమ తగ్గదు. మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాం’ అని ఖుష్బూ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఖుష్బూ రజినీకాంత్ సరసన అన్నాత్తే అనే సినిమాలో నటిస్తోంది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనా కీర్తి సురేష్ నటిస్తున్నారు.