నాలా ఎవరు కరోనా బారినపడవద్దు: స్టార్ హీరోయిన్

0

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే రోజుకి వేలసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో జనాలు బాధితులుగా మారుతున్నారు. తాజాగా కరోనా పరిస్థితి పై స్పందించింది కుర్రహీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు ప్రస్తుతం ఇటు సౌత్ అటు నార్త్ సినిమాలతో బిజీగా ఉంటోంది. అలాగే క్రమం తప్పకుండా షూటింగ్స్ లో పాల్గొంటుంది. అయితే ఇన్నిరోజులు మాస్కులు లేకుండా కూడా జనాలు తిరిగారు. కానీ ఇప్పుడు రెండవ దశ మొదలైంది అనేసరికి అందరూ మాస్కులు పెట్టుకున్నారా లేదా అనేది ఖచ్చితం అయిపోయింది. తాజాగా రకుల్ షూటింగ్ సమయం ఎదుర్కొంటున్న విషయాలను షేర్ చేసుకుంది.

సెట్స్ లో ఎంతమంది ఉన్నా అందరూ మాస్కులు పెట్టుకున్నారా లేదా అనే దానిపై మైండ్ దృష్టి పెడుతుందని.. షూటింగ్స్ చేస్తున్నా కూడా ప్రశాంతంగా లేదంటుందట రకుల్. సెట్ లో ఎవరిని చూసిన అనుమానం కలుగుతుంది. మన చుట్టూ ఉన్న మనవాళ్లనే అనుమానించ వలసిన పరిస్థితి రావడం ఘోరం. షూటింగ్ సమయంలో మేం నటులం కాబట్టి మాస్కులు పెట్టుకోలేం. ఎందుకంటే మాస్కు మా మేకప్ ను చెడగొడుతుంది. అందుకే మేం పెట్టుకోకున్నా సెట్ లో అందరూ పెట్టుకోవడం గురించి ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న ఇబ్బంది మాస్క్ ఒక్కటే. ఎందుకంటే మాస్క్ ఉంటే హ్యాపీగా.. మాస్క్ లేకపోతే భయంతో మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాక ఈ ఏడాది కూడా సినిమా ఇండస్ట్రీ థియేటర్స్ చతికిలా పడే పరిస్థితి వస్తుందేమో అంటూ అనుమానం వ్యక్తం చేసింది. మరి అమ్మడు ఇదివరకు ఓసారి కరోనా బారినపడింది. తనలా ఎవరు వైరస్ బారినపడొద్దు అంటూ చెప్పుకొచ్చింది.