నలుగురు స్టార్ల పేర్లు బయటపెట్టిన రకుల్…?

0

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిన్న (శుక్రవారం) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్డో(ఎన్సీబీ) ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగు చూసిన డ్రగ్స్ వినియోగం సరఫరా కోణంలో ఎన్సీబీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తి వాట్సాప్ చాట్ ఆధారంగా రకుల్ కు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వచ్చిన రకుల్ ను అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారని తెలుస్తోంది. అదే సమయంలో దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ని కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఇక క్షితిజ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్ లభించినట్లు తెలుస్తోంది.

కాగా డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పలు కీలక విషయాలను వెల్లడించారని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విచారణలో రియా చక్రవర్తితో తాను చాట్ చేసినట్లు రకుల్ అంగీకరించిందని.. 2018లో రియాతో డ్రగ్స్ పై చాటింగ్ జరిగిందని.. అయితే తనకు డ్రగ్స్ లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని.. తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని రకుల్ తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అంతేకాకుండా ఎన్సీబీ విచారణలో రకుల్ నలుగురు స్టార్ల పేర్లు వెల్లడించిన ‘టైమ్స్ నౌ’ కథనంలో తెలిపింది. రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సిబికి ఇచ్చిన స్టేట్మెంట్ లో క్షితిజ్ రవి ప్రసాద్ డ్రగ్స్ ని సేకరించి హై ప్రొఫైల్ సెలబ్రిటీలకు సరఫరా చేసేవాడని.. 2019 కెజో పార్టీ గురించి కూడా తెలుసునని చెప్పిందని.. క్షితిజ్ రకుల్ ప్రీత్ ను మధ్యవర్తిగా ఉండమని కోరితే ఆమె తిరస్కరించినట్లు ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ రకుల్ లేదా ఆమె లీగల్ టీమ్ దీనిపై స్పందిస్తే అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.