టాలీవుడ్ రేసింగ్ లో వెనకబడ్డ స్టార్ హీరో

0

టాలీవుడ్ స్టార్ హీరోల నడుమ ఠఫ్ కాంపిటీషన్ గురించి తెలిసిందే. ప్రభాస్.. మహేష్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ .. వీళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ బక్సాఫీస్ రికార్డుల్ని నెలకొల్పుతున్నారు. అయితే ఈ రేస్ లో ఒకరు ఒకసారి ముందుకు వెళితే.. ఇంకొకరు ఇంకోసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తున్నారు.

ప్రస్తుతం రేస్ లో డార్లింగ్ ప్రభాస్ ఎవరూ అందుకోనంత ఎత్తుకి ఎదిగేస్తున్నాడు. బాహుబలి- సాహో చిత్రాలతో అతడు తన మార్కెట్ రేంజును పాన్ ఇండియా స్థాయికి విస్తరించాడు. ఇరుగు పొరుగునా డార్లింగుకి ఉన్న మార్కెట్ అందరికీ ఓ గుణపాఠం లాంటిది.

ప్రభాస్ కి పోటీగా ఇతర హారోలు కూడా మార్కెట్ రేంజ్ పెంచుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ రేస్ లో అల్లు అర్జున్.. ఎన్టీఆర్.. మహేష్ జరంత స్పీడ్ గానే ఉన్నారని చెప్పాలి. వీళ్లంతా ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లను క్యూలో పెట్టి వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. వీళ్లతో పోలిస్తే చరణ్ మాత్రం ఎందుకనో స్థబ్ధుగా ఉన్నారు.

రాజమౌళి దర్శకత్వంలో `రౌద్రం రణం రుధిరం` మినహా వేరొక సినిమాకి చరణ్ ఇంతవరకూ కమిట్ కానే లేదు. ప్రభాస్ రాధేశ్యామ్ తో పాటు నాగ్ అశ్విన్.. ఓం రౌత్ లతో పాన్ ఇండియా చిత్రాలకు కమిటయ్యాడు. తారక్ వరుసగా త్రివిక్రమ్- కొరటాల- కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ లతో సినిమాలు చేయనున్నాడు. సుకుమార్ తో `పుష్ప` తర్వాత కొరటాల .. త్రివిక్రమ్ లకు అల్లు అర్జున్ కమిటయ్యాడు. యాత్ర ఫేం మహి.వి. కి కమిట్ మెంట్ ఇచ్చాడు. మహేష్ ఇప్పటికే పరశురామ్ తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాతా అనీల్ రావిపూడి.. పూరీ.. త్రివిక్రమ్ లకు ఆఫర్లు ఇచ్చాడని ప్రచారమవుతోంది. ఏ ఇతర హీరోతో పోల్చినా చరణ్ మాత్రం రేస్ లో వెనకబడి ఉన్నాడనే చెప్పాలి. ప్రస్తుతం అతడు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ముగించి ఆచార్య సెట్స్ కి జాయిన్ కావాల్సి ఉంది.