పాక్ సినీ నటితో దావూద్ ఇబ్రహీం ఎఫైర్?

0

1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి.. ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ప్రముఖ నటితో ప్రేమాయణం నడుస్తోందని అక్కడి మీడియా కోడైకూస్తోంది. అందుకే ఐటం గర్ల్ గా తన సినీ కెరీర్ ఆరంభించిన మోహ్విష్ హయత్ కు పాకిస్తాన్ పౌరపురస్కారమైన ‘తమ్గా ఇంతియాస్’ 2019లో లభించిందని ఆరోపించాయి. ఎందుకంటే అంతగా పాకిస్తాన్ సినీ పరిశ్రమకు తెలియని ఆమెకు ఆ అవార్డు దక్కడం వెనుక దావూద్ ఇబ్రహీం లాబీయింగ్ ఉందని సినీ పరిశ్రమ ఆరోపణ..

37ఏళ్ల మోహ్విష్ హయాత్ తో దావుద్ కు సంబంధాలున్నాయని.. ఆమెతో దావూద్ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాడని తాజాగా వెల్లడైంది. ముంబైలో ఉన్నప్పుడు కూడా బాలీవుడ్ హీరోలు హీరోయిన్లతో దావూద్ కు సంబంధాలున్నాయి. పలు సినిమాల్లోనూ దావూద్ పెట్టుబడులు పెట్టారు.

ఇప్పుడు పాకిస్తాన్ కు పారిపోయాక కూడా సినీ ఇండస్ట్రీతో సంబంధాలు నెరుపుతూ సినీ హీరోలతో ఎఫైర్లు కొనసాగుతున్నాయని సమాచారం. దావూద్ వల్లనే మోహ్విత్ కు పెద్ద సినిమాల్లో తాజాగా అవకాశాలు లభిస్తున్నాయని ప్రచారం సాగుతోంది.