అమ్మ కల నెరవేరబోతుంది : చరణ్

0

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్యలో చరణ్ నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే ప్పటి వరకు ఆ విషయంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఇటీవల చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మ కోరికను తీర్చబోతున్నాను. నాన్న నేను కలిసి నటిస్తే చూడాలని అమ్మ చాలా కాలంగా కోరుకుంటుంది. అది ఆచార్య సినిమాతో నెరవేరబోతుందని చరణ్ పేర్కొన్నాడు. ఇంతకు ముందు మగధీర బ్రూస్ లీ ఖైదీ నెం.150 సినిమాల్లో ఇద్దరు కొన్ని సెకన్ల పాటు కలిసి కనిపించారు. కాని ఆచార్య సినిమాలో మాత్రం చరణ్ మరియు చిరుల కాంబో సీన్స్ దాదాపుగా అర్థ గంట పాటు ఉంటాయని అంటున్నారు.

చరణ్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాన్నతో ఇంతకు ముందు ఖైదీ నెం.150 మరియు బ్రూస్ లీ లో చేశాను. కాని ఈసారి ఒక పాత్రను నాన్న సినిమాలో చేసేందుకు రెడీ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆచార్య సినిమాతో అమ్మ డ్రీమ్ ను నెరవేర్చబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చరణ్ పేర్కొన్నాడు. ముందు ముందు కూడా అవకాశం ఉంటే నాన్నతో సినిమాలు చేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ముందు ముందు మా కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నట్లుగా చరణ్ అన్నాడు.

ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ఈ గ్యాప్ లో ఆచార్య సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని కొరటాల మరియు మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.