చరణ్ కి జోడీ అంటూ మరో బ్యూటీ పేరు వినిపిస్తోందే…!

0

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు కెరీర్లో 152వ చిత్రంగా రాబోతున్న ‘ఆచార్య’ని కొరటాల శివ గత చిత్రాల శైలిలోనే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరు – చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘ఆచార్య’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ముందుగా చరణ్ సరసన ఇంతకముందు ‘రచ్చ’ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ చిత్రంలో చెర్రీ తో కలిసి నటించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి జత కట్టనుందని న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ క్రమంలో లేటెస్టుగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న ‘ఆచార్య’ సినిమాలో చరణ్ కు జోడీగా కనిపించనుందని మరో వార్త సర్క్యూలేట్ అవుతోంది. రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. మరి చివరికి రామ్ చరణ్ పక్కన ఏ బ్యూటీని ఫైనలైజ్ చేస్తారో చూడాలి. ఇక ‘ఆచార్య’ షూటింగ్ త్వరోనే తిరిగి ప్రారభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు.