అమ్మాయిల కలల రాకుమారుడిలా మారాడు

0

ఇస్మార్ట్ శంకర్ గా పక్కా మాస్ ట్రీటిచ్చాడు ఎనర్జిటిక్ రామ్. అయితే రామ్ నిజంగా అంత మాసీగా ఉంటాడా? అంటే అస్సలు కానే కాదు. అవసరం మేర పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఈ ఎనర్జిటిక్ యంగ్ హీరోకి అలవాటు. ఒకవేళ ఏదైనా క్లాస్ రోల్ ని ఆఫర్ చేస్తే ఆ రోల్ లోకి పరకాయం చేసి సత్తా చాటగల సమర్థుడు.

టాలీవుడ్ లో ఉన్న స్మార్టెస్ట్ హీరోల జాబితా తిరగేస్తే.. అందులో టాప్ 5లో రామ్ పేరు ఉండి తీరుతుంది. ఫెయిర్ లుక్ .. స్మార్ట్ ఫిట్ లుక్ రామ్ కి ప్రత్యేక ఆకర్షణ. అతడు క్లాస్ గా టక్కు టైతో కనిపిస్తే ఆ రేంజే వేరుగా ఉంటుంది. అందుకు సంబంధించిన ఫోటోషూట్లు ఇంతకుముందు రివీలయ్యాయి. కీనూ రీవ్స్ అంత స్టైలిష్ గా కనిపించే టాలీవుడ్ హీరోగా అతడి లుక్కుకి పడిపోని మగువ ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

తాజాగా రామ్ ఫోటోషూట్ ఒకటి అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. 32 ఏళ్ల రామ్ సంథింగ్ స్పెషల్ గా యువతుల మనసు దోచే స్మార్ట్ ప్రిన్స్ లా కనిపిస్తున్నాడు ఈ ఫోటోలో. ఫుల్ హ్యాండ్స్ టైట్ ఫిట్ టీషర్ట్.. బాటమ్ లో ఫార్మల్ థిక్ కలర్ ఫ్యాంటుతో అతడి లుక్కు సంథింగ్ హాట్ అనే చెప్పాలి. ఎంపిక చేసిన డిజైనర్ లుక్ కి తగ్గట్టే కాస్త చెరిగిన క్రాఫ్ స్మైలీ ఫేస్ తో .. లైట్ గడ్డంతో ఎంతో స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. బాటిల్స్ బిహైండ్ రామ్ పోతినేని తాజా చిత్రాలు ట్విట్టర్లో ఫ్రెష్ లుక్ తో అలరిస్తున్నాయి. 32ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి టీనేజర్ లా మరిపోయాడా? అంటూ షాక్ కు గురవుతున్నారు గాళ్స్.

ఇక ఈ ఫోటోకి అందమైన థీమ్ ని జోడించారు. “9 నుండి 5 వరకు: మీరు ఎలా రాక్ అవుతున్నారో వారికి చూపించండి. 5 నుండి 9 వరకు: మీరు ఎలా రోల్ చేస్తారో వారికి చూపించండి” అన్న వన్ లైనర్ థీమ్ ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాల్లో ఈ ఫోటో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది. దీనికి నెటిజనుల స్పందన ఆకట్టుకుంటోంది. ఇక రామ్ ఫోటోషూట్ బ్యాక్ గ్రౌండ్ లో బాటిల్స్ పైనా అభిమానుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఏదేమైనా రామ్ న్యూ రీఫ్రెషింగ్ లుక్ సంథింగ్ హాట్ గా మారింది. రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న రెడ్ ప్రచార వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ గా మారాయి. రామ్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.