హాలీడేలో రానా – మిహిక జాలీ మూడ్…!

0

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఆగష్టు 8న జరిగిన వివాహ వేడుకలో తన ప్రేయసి మిహికా బజాజ్ ని మూడు ముళ్ల బంధంతో ముడివేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది అతిథులు సన్నిహితుల మధ్య రానా – మిహిక వివాహం వైభవంగా జరిగింది. ప్రస్తుతం రానా నటిస్తున్న ఏ సినిమా షూటింగ్ కూడా తిరిగి ప్రారంభం కాకపోవడంతో తన సతీమణితో కలిసి హాలిడేని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా మిహికా తన భర్తతో కలిసి జాలీగా గడుపుతున్న ఓ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

‘జస్ట్ బికాజ్ రానా’ అంటూ మిహికా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరు ఎంజాయ్ చేస్తున్న ప్లేస్ ఏదో వెల్లడించనప్పటికీ.. రానా మిహికాలు సాధారణంగా బీచ్ లో ధరించే దుస్తుల్లో కనిపిస్తున్నారు. కాగా కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న రానా.. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో ‘విరాట పర్వం’ అనే సోషల్ డ్రామాలో నటిస్తున్నాడు. అలానే గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే భారీ బడ్జెట్ సినిమా చేయనున్నాడు. లాక్ డౌన్ కంటే ముందే తెలుగు తమిళ హిందీ భాషల్లో ‘అరణ్య’ అనే పాన్ ఇండియా మూవీ పూర్తి చేశాడు. నవంబర్ ఫస్ట్ వీక్ నుండి ‘విరాట పర్వం’ చిత్రీకరణ ప్రారంభిస్తాడని తెలుస్తోంది.