నటి కంగన రనౌత్ పై మరో కేసు

0

బాలీవుడ్ క్వీన్.. ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ తో కయ్యానికి కాలుదువ్విన నటిపై బోలెడు ఫిర్యాదులు వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని ఎలుగెత్తి చాటినందుకు ఆమెపై శివసేన సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది.

తాజాగా నటి కంగనా రౌనత్ పై కేసు నమోదు చేయాలని బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు పోలీసులను ఆదేశించింది. ముంబైలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా నటి కంగనా అభ్యంతరకర ట్వీట్ చేసిందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ముంబై పోలీసులు శివసేన సర్కార్ ఫెయిల్ అయ్యిందని కంగనా రౌనత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా పోల్చారు.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దీనిపై ముంబై కోర్టును ఆశ్రయించారు. వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు కంగనాపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.