‘సామ్ జామ్’.. ఈసారి రానా నాగ్ అశ్విన్

0

‘సామ్-జామ్’ పేరుతో సమంత హోస్ట్ గా అల్లు అరవింద్ సారథ్యంలోని ‘ఆహా’ ఓటీటీలో తొలి ఎపిసోడ్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్లో హీరో విజయ్ దేవరకొండను కూర్చోబెట్టి సమంత యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత ఓ మానసిక నిపుణుడిని.. వైద్యుడిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం.. ఆ వెంటనే ఓ పేద కుటుంబాన్ని వేదికపైకి తీసుకొచ్చి వాళ్లతో మాట్లాడించడం.. మధ్యమధ్యలో వైవా హర్షం ఎందుకు వస్తున్నాడో.. ఎందుకో పోతున్నాడో తెలియకపోవడం కన్పించాయి. మొత్తానికి షో నిర్వాహాకులు ఏదో కొత్త ట్రై చేయాలని తలంచి చివరికీ కిచిడి చేసినట్లుగా విమర్శలు వచ్చాయి.

అయితే రెండో ఎపిసోడ్ కు హైప్ తేవడానికి అల్లు అరవింద్ ఏకంగా తన బావ అయిన చిరంజీవిని రంగంలోకి దింపినట్టు ఆయన వస్తున్న ఫొటోలు లీక్ అయ్యాయి. చిరంజీవి రాకతో సమంత షోకు క్రేజ్ వస్తుందని ఆశించారు.

కానీ సడన్ గా ఆ షో రిలీజ్ కాకముందే ఇప్పుడు హీరో రానా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంట్రీ ఇచ్చారు. వీరితో సమంత సందడి చేసినట్టు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రెండో ఎపిసోడ్లో హీరో రానా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ లు పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆహా టీం సోషల్ మీడియాలో వారికి సంబంధించిన టీజర్ ఫొటోలు షేర్ చేసింది. సమంత వారితో చిట్ చాట్ నిర్వహించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో రిలీజ్ కానుంది.