మాల్దీవుల క్యాంప్ లో చేరిన అక్కినేని కోడలు

0

వరుస పెట్టి ఊరి జనమంతా మాల్దీవులకు షిఫ్టయిపోతున్నారు. మహమ్మారీ భయాల్ని తరిమేయాలంటే ఒంటరి దీవిలో బులుగు సముద్రంలో మునిగి రిసార్ట్ విందు ఆరగించడమే కరెక్ట్ అని డిసైడైనట్టే కనిపిస్తోంది.

ఇప్పటికే పలువురు అందాల కథానాయికలు మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్నారు. ఈ జాబితాలో కాజల్ .. రకుల్ ప్రీత్.. పరిణీతి.. మలైకా ఇలా హాటెస్ట్ భామలంతా ఉన్నారు. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ లో అక్కినేని కోడలు సమంత కూడా చేరారు.

సామ్ ఇటీవలే సామ్ జామ్ అనే టాక్ షో షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వృత్తిగత జీవితంపై నిబద్ధత చూపిస్తూనే ఇలా ఆస్వాధనలు ప్లాన్ చేయడం సామ్ స్టైల్. తన పనిని పూర్తి చేసిన తరువాత సమంత మాల్దీవులకు వెళ్లి అందమైన బీచ్ లలో సెలవుదినాన్ని ఆస్వాధించింది. తాను ఉండే రిసార్ట్ నుండి ఒక ఫోటోని పోస్ట్ చేసింది. సమంత మాల్దీవుల్లో విరవిహారం చేస్తారని అభిమానులు భావిస్తున్నా.. సాధ్యమైనంత వేగంగా అక్కడ టూర్ ముగించి త్వరలోనే ఆమె తిరిగి పనిలోకి వస్తారని భావిస్తున్నారు.

సామ్ జామ్ బిజీతో పాటు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానున్న హర్రర్ డ్రామా కోసం సమంతా త్వరలో నందిని రెడ్డితో చేతులు కలుపుతుంది. సోనీ పిక్చర్స్ ఇండియా ఈ మూవీని నిర్మించనుంది. మజిలీ తరహాలో చైతూతో కలిసి ఓ సినిమా చేయాలన్న ప్లాన్ కూడా ఉంది.