మిహీకతో దేవుడు చిన్నప్పుడే ముడి వేశాడా రానా?

0

టాలీవుడ్ హీరోలు.. హీరోయిన్ల ప్రేమకథలు సినిమా కథల్ని తలపిస్తున్నాయి. నాగచైతన్య- సమంత ఏడేళ్లుగా ప్రేమించుకుని ఆ తరువాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు. నితిన్ ప్రేమకథ కూడా ఇంతే. రీసెంట్ గా తెరపైకొచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ కి కూడా కొన్నేళ్ల క్రిందటే బీజం పడింది. బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లూని ఈ నెల 30న కాజల్ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే మొన్న ఆగస్టు 8న వివాహం చేసుకున్న రానా ప్రేమకథ వెనక కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ వుందట. మే 12న తను ఓ అమ్మాయికి ప్రపోజ్ చేశానని ఆ అమ్మాయి ఫైనల్ గా యస్ చెప్పిందని రానా తన ఫియాన్సీ మిహీకా బజాజ్ ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ముంబైలో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని రన్ చేస్తున్న మిహీకా బజాజ్ .. రానాల పెళ్లికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆగస్టు 8న అత్యంత సన్నిహితులు 30 మంది మాత్రమే పాల్గొనగా వీరి వివాహం హైదరాబాద్ లో జరిగింది.

అయితే మిహీక దగ్గుబాటి వెంకటేష్ కుమార్తె కు స్నేహితురాలు అన్న సంగతిని ఇంతకుముందు రానా చెప్పారు. కానీ ఇప్పుడో ఊహించని కొత్త పాయింట్ చెప్పుకు రావడం చర్చకు వచ్చింది. రానాకు మిహీక కేవలం ఈ ఏడెనిమిదేళ్ల స్నేహమే అనుకున్నారంతా. కానీ అంతకు మించి ఇంకా చాలా ఉంది. తన ప్రేమకథ గురించి ఓ సీక్రెట్ లోతు పాతుల్ని రానా దగ్గుబాటి తాజాగా బయటపెట్టాడు. ఓ టీవీ కార్యక్రమంలో మిహీకాతో తన ప్రేమకథ ఎప్పుడు మొదలైందో ఓపెన్ చేశాడు. మిహీకా తనకు చిన్నతనం నుంచే తెలుసని.. తన సోదరి.. మిహీకా కలిసి స్కూల్ కి వెళ్లేవారని ఆ తరువాత మిహీకా ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అయ్యిందని తెలిపాడు రానా. ఆ పరిచయం వల్లే లాక్ డౌన్ సమయంలో మిహీకాకు ప్రపోజ్ చేశానని తన వెంటనే యస్ చెప్పేసిందని చెప్పుకొచ్చాడు రానా. అంటే చిన్నప్పటి నుంచి తన ఊహలో ఉన్న అమ్మాయి మిహీకనేనా.. దేవుడు అలా ముడివేశాడా? అన్నది ఇప్పుడు అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట.