పెళ్ళి తర్వాత జీవితంపై రానా స్పందన..

0

కరోనా లాక్డౌన్ టైమ్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సెలెబ్రిటీలు పెళ్ళి చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. నిఖిల్ తో మొదలు పెట్టి, నితిన్, రానా, తాజాగా కాజల్… ఇలా వరుస పెట్టి ఒక్కొక్కరుగా తమ జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించారు. ఐతే పెళ్ళి తర్వాత జీవితంపై రానా స్పందించాడు. సాధారణంగా పెళ్ళికి ముందున్నట్టు పెళ్ళి తర్వాత ఉండదు అని అంటారు. పెళ్ళి తర్వాత జీవితం చాలా మారిపోతుందని చెబుతుంటారు.

కానీ పెళ్ళి తర్వాత కూడా తన జీవితం పెద్దగా మారలేదని, అంతకుముందుకీ, ఇప్పటికీ పెద్దగా మార్పేదీ కనిపించట్లేదని చెప్పుకొచ్చాడు. పెళ్ళి తర్వాత లైఫ్ మారిపోతుందనేది అందరి విషయాల్లో కరెక్ట్ కాదనీ, నాకైతే అలా అనిపించలేదని అన్నాడు. తన జీవిత బ్భాగస్వామి మిహీకా బజాజ్ లైఫ్ లోకి వచ్చాక బాధ్యత పెరిగిందని, తనతో జీవితం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.