Templates by BIGtheme NET
Home >> Cinema News >> పుష్ప కోసం రంగస్థలం ఫార్ములా..?

పుష్ప కోసం రంగస్థలం ఫార్ములా..?


సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీని రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో షూట్ చేయాలని ముందు ప్లాన్ చేశారు. కానీ అది కుదరని పని అని తేలడం.. నిత్యం వందల కొద్దీ జనం తాకిడితో షూటింగ్ కష్టమని తేల్చుకుని హైదరాబాద్ కు మార్చేశారు. జూబ్లీ హిల్స్ లోని నిర్మానుష్య ప్రాంతంలో రాజమండ్రి లుక్ తో విలేజ్ సెట్ ని వేసి షూటింగ్ ని పూర్తి చేశారు.

కొంత పొల్లాచ్చీలో పూర్తి చేశారు. సుక్కు తన తాజా చిత్రానికి ఇదే ఫార్ములాని రిపీట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల బన్నీ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ని మారేడుమిల్లి ఫారెస్ట్ లో మొదలు పెట్టిన విషయం తెలిసిందే. టీమ్ లో కొందరికి కోవిడ్ సోకడంతో తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. ఇక్కడే సెట్ లో `రంగస్థలం` తరహాలో `పుష్ప`ని కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్ లోనే అడవికి సంబంధించిన సెట్ ని నిర్మిస్తున్నారట. ఇక్కడి సెట్ లో కీలక ఘట్టాలని పూర్తి చేసి బ్యాలెన్స్ సన్నివేశాలను మళ్లీ అడవిలో పూర్తి చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందు కోసం అక్కడ ఇప్పటికే సెట్ ల నిర్మాణం మొదలుపెట్టారని అవి పూర్తి కాగానే షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.