చాలా నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగు పెట్టిన గీత

0

కరోనా కారణంగా షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో హీరోయిన్స్ ఒక్కరు ఇద్దరు తప్ప దాదాపు అంతా కూడా వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పోయారు. హైదరాబాద్ లో రెగ్యలర్ గా డజన్ల కొద్ది స్టార్ హీరోయిన్స్ ఉండేవారు. కాని లాక్ డౌన్ కు ముందే అంతా కూడా వారి సొంత రాష్ట్రాలకు చేరారు. షూటింగ్స్ ప్రారంభం అవుతున్న సమయంలో మళ్లీ హీరోయిన్స్ హైదరాబాద్ బాట పడుతున్నారు. అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఎయిర్ వేస్ ద్వారా చేరుకుంటున్నారు. తాజాగా ముద్దుగుమ్మ రష్మిక మందన్న కూడా హైదరాబాద్ చేరుకుంది.

రష్మిక గత కొన్ని నెలలుగా తన సొంత రాష్ట్రం అయిన బెంగళూరులోని మంగళూరు మరియు తన సన్నిహితుల వద్ద ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆమె హైదరాబాద్ కు ‘పుష్ప’ సినిమా విషయమై వచ్చింది. పుష్ప సినిమాను వచ్చే నెల నుండి సుకుమార్ పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అందులో భాగంగా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు మూడు నుండి వారం రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించబోతున్నారట. ప్రముఖ టెక్నీషియన్స్ మరియు నటీనటులతో ఈ వర్క్ షాప్ సాగుతుందని అంటున్నారు.

ఈ వర్క్ షాప్ లో పాల్గొనడం కోసమే రష్మిక అక్కడ నుండి వచ్చింది. అతి త్వరలో మళ్లీ ఈమె వెళ్లిపోనుంది. షూటింగ్ ప్రారంభంకు వారం రోజుల ముందు ఈమె రాబోతుంది. ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ సినిమాలతో సక్సెస్ లను దక్కించుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు తమిళంలో ఒకటి నటిస్తూ మరో రెండు మూడు సినిమాల చర్చలు జరుపుతోంది.