అక్కినేని హీరో సరసన లక్కీ బ్యూటీ..?

0

అక్కినేని అఖిల్ సాలిడ్ హిట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు – వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ దక్కుతుందని అఖిల్ నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అవకుండానే మరో ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ‘సరిలేరు నీకేవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ని హీరోయిన్ గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి వరుస విజయాలు అందుకున్న రష్మిక.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో యువ హీరో శర్వానంద్ కి జోడీగా కనిపించనుంది. ఈ క్రమంలో ఇప్పుడు #Akhil5 లో అఖిల్ సరసన నటించనుందని సమాచారం. కాగా అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబోపై అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టే ఈ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం.