శర్వాకు జోడీగా లక్కీ బ్యూటీ…!

0

టాలెంటెడ్ హీరో శర్వానంద్ లేటెస్టుగా ”ఆడాళ్లూ.. మీకు జోహార్లు” అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘చిత్రలహరి’ ‘రెడ్’ వంటి సినిమాలను రూపొందించిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నారు. గతంలో శర్వాతో ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని తీసిన సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న తిరుపతిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ లక్కీ బ్యూటీ అనిపించుకున్న రష్మిక మందన్న ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’లో శర్వానంద్ కి జోడీగా నటించనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీకి మరో కక్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కిందని చెప్పొచ్చు. కిషోర్ తిరుమల – శర్వానంద్ – రష్మిక మందన్న కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. కాగా ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’ చిత్రం మహిళల గొప్పతనాన్ని వివరించే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కు ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని తీస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.