హాలోవీన్ 2020 అంటూ ఈ స్టార్ మమ్మీ ఉల్లాసం చూశారా?

0

బ్రిటీష్ బిజినెస్ మేన్ జార్జి పనాయటౌని పెళ్లాడక ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎమీజాక్సన్ ఎంత హడావుడి చేసిందో తెలిసినదే. బేబి బంప్ తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చాక సోషల్ మీడియాల్లో నిరంతరం ఫెస్టివల్ ని ప్లాన్ చేసిన ఎమీ కుమారునితో కలిసి వరుస ఫోటో ట్రీట్ కి శ్రీకారం చుట్టింది.

ఇదిగో ఎమీ బాటలోనే కర్థాషియన్ ఫ్యామిలీ నుంచి వేరొక పాప్ గాయని కోలే సాషీ ఇదిగో ఇలా బిడ్డతో కలిసి ఎలా ఫోజిచ్చిందో చూశారుగా.. ఫుల్ చిలౌట్ మూడ్ లో ఉన్న ఈ అమ్మడు హాలోవీన్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. పులి ఛర్మం తో డిజైన్ చేసిన డ్రెస్ ని బిడ్డకి తొడిగి తాను కూడా ధరించి అదిరిపోయే ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో జోరుగా వైరల్ అవుతోంది

36 ఏళ్ల ఈ అమ్మడు ఏం చేసినా సెన్సేషనే. తన రూపాన్ని మార్చుకునేందుకు మైఖేల్ జాక్సన్ లా శస్త్రచికిత్సకు మొగ్గు చూపింది అంటూ విమర్శలు ఉన్నాయి. ఆమె ముఖం మారుతోంది అంటూ సోషల్ మీడియాల్లో నెటిజనుల వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి. “కొన్నిసార్లు నేను ప్రజలతో కొంచెం ఎఫ్ * చేయవలసి ఉంటుంది … నేను ప్రయత్నించను! నేను మంచిగా ప్రవర్తించటానికి ప్రయత్నిస్తాను.. కానీ కొన్నిసార్లు వారు దాని కోసం అడుగుతున్నారు“ అంటూ తనపై కామెంట్లు చేసేవాళ్లపై కోలే తెగ విరుచుకుపడింది ఓసారి. ఆన్ లైన్ లో ద్వేషించే సైన్యం నుండి దుర్మార్గపు వ్యాఖ్యలను ఎదుర్కొంటూ తాను సీరియస్ అయిపోతుంటుంది.

మాజీ ట్రిస్టన్ థాంప్సన్ తన జీవితంలోకి తిరిగి రావడంతో ఖోలీ తన ప్రదర్శనలో ఎక్కువ సమయం కేటాయిస్తోంది. లాక్ డౌన్ లో తమ కుమార్తె ట్రూతో సంతోషంగా ఆడటం ప్రారంభించిన తర్వాత ఇలా ఫోటో ట్రీట్ తో చెలరేగుతోంది.