#KGF2 `అధీరా`కు ధీటుగా రవీనా దర్పం చూశారా?

0

అంతా సవ్యంగా సాగితే పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 ఈపాటికే రిలీజ్ కావాల్సినది. తొలి నుంచి కోర్టు గొడవలు.. చివరిలో మహమ్మారీ తలనొప్పి వాయిదాలకు కారణమైంది. 2021 సంక్రాంతికి ఎట్టి పరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఈ మూవీ నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేస్తున్నారట.

ఇంతకుముందు రిలీజైన రాక్ స్టార్ యష్ లుక్ అలాగే అధీరాగా సంజయ్ దత్ లుక్ ఫ్యాన్స్ లో వైరల్ అయ్యాయి. వాటికి స్పందన అద్భుతం. తాజాగా రవీనా టాండన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి తన లుక్ రిలీజైంది. రామిక సేన్.. క్రూరత్వానికి ప్రతీకగా ఆ పాత్ర కనిపించనుందట.

“రాయబడిన దారుణం !!! # KGFChapter2 నుండి #RamikaSen లుక్ ఇది. మంచి బహుమతి ఇచ్చినందుకు KGF బృందానికి ధన్యవాదాలు” అంటూ రవీనా ఎమోషనల్ అయ్యింది. మెరూన్ చీరలో అధికారం దర్పం ప్రదర్శిస్తున్న మహిళా శక్తిగా తనని ఆవిష్కరించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధీరాకు ధీటుగా ఈ లుక్ ఉందంటూ ప్రశంసలు కురిపించేస్తున్నారు రవీనా అభిమానులు. KGF రాకీ (యష్) భాయ్ స్టోరి. అతను పేదరికం నుండి ఎగసిన శిఖరం. బంగారు గనికి రాజు అవుతాడు.. ఆ క్రమంలోనే మాఫియాతో పోరాటం ఏంటనేది పార్ట్ 2లో చూపించనున్నారు.

సంజయ దత్ క్యాన్సర్ ను జయించి నవంబర్ లో సెట్స్ లో జాయిన్ అవుతున్నారు. యష్- ప్రకాష్ రాజ్ – మాలవికా అవినాష్ ఆగస్టులో చిత్రీకరణలో పాల్గొన్నారు. కరోనావైరస్-ప్రేరిత దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా మార్చిలో సినిమా నిర్మాణం ప్రభావితమైనా చిత్రబృందం ఆగస్టులో డేర్ చేసి తిరిగి చిత్రీకరణ ప్రారంభించింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కూడా నటించారు.

రవీనా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లోని డల్ హౌసీలో తన తొలి వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అన్ని కోవిడ్ -19 మార్గదర్శకాలకు కట్టుబడి సిరీస్ తారాగణం సిబ్బంది కొండలు కోనల రాష్ట్రానికి ప్రయాణించారని తెలుస్తోంది.

90 లలో బాలీవుడ్ అగ్రశ్రేణి నటులలో ఒకరైన రవీనా.. మోహ్రా- అందాజ్.. అప్నా అప్నా- లాడ్లా- దుల్హే రాజా- శూల్- అక్స్ – డామన్ – సత్తా – మాత్ర్ చిత్రాలతో పాపులర్ స్టార్ గా ఆవిష్కరించుకున్నారు. అప్పట్లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ సినిమా బుడ్డా హోగా తేరా బాప్ లో అమితాబ్ తో పాటు కలిసి నటించారు. కేజీఎఫ్ 2 రవీనా కెరీర్ జర్నీలో కీలక మూవీగా నిలవనుంది.