రేటు పెంచేసిన రియల్ హీరో

0

కరోనా టైంలో రియల్ హీరోగా మారి వేలాది మందికి సాయం చేసిన సోనూసూద్ వలస కార్మికుల పట్ల దేవుడు అయ్యాడు. గత కొంత కాలంగా సాయం కావాలన్న ప్రతి ఒక్కరికి కూడా సోనూసూద్ సాయం చేస్తూ వచ్చాడు. కోట్లాది రూపాయలను సాయంకు వినియోగించిన సోనూసూద్ అందరిని ఆశ్చర్యపర్చాడు. సోషల్ మీడియాలో సోనూసూద్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన్ను ఇప్పుడు చిన్న పాత్రలో చూపించినా కూడా ఆయన కోసం సినిమా చూసే వారు చాలా మంది తయారు అయ్యారు. అందుకే పలువురు ఫిల్మ్ మేకర్స్ సోనూసూద్ ను తమ సినిమాల్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో వరుసగా వస్తున్న ఆఫర్ల కారణంగా సోనూసూద్ తన పారితోషికంను అమాంతం పెంచేశాడు. గతంలో సోనూసూద్ రోజు వారి పారితోషికం 6 లక్షల నుండి 9 లక్షల మద్య ఉండేది. ఆయన ఖర్చులు మరో లక్ష రూపాయలు ఉండేది. కాని ఇప్పుడు ఆ పారితోషికం రెట్టింపు చేశాడు. అయినా కూడా ఆయన డేట్ల కోసం దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. చిన్న నిర్మాతలకు అందనంత ఎత్తుకు సోనూసూద్ ఎదిగాడు అనేది కూడా కామెంట్ వినిపిస్తుంది. మొత్తానికి సోనూసూద్ ఈ కరోనా టైమ్ ఓ వచ్చిన రియల్ హీరో ఇమేజ్ తో బాగానే సంపాదిస్తున్నాడు.

ఆయన ఖర్చు పెట్టినంత కాకున్నా కూడా ఆయనకు భారీగా పారితోషికం రూపంలో రావడం ఆయన అభిమానులకు కూడా ఒకింత ఆనందంను కలిగిస్తుంది. సోనూసూద్ ను హీరోగా చేసే ప్రయత్నాలు కూడా కొందరు చేస్తున్నారు. కాని ప్రస్తుతానికి సోనూసూద్ ఆ విషయమై ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా లేడు. హీరోగా చేస్తే మరింతగా లాభం దక్కే అవకాశం ఉంది అనేది కొందరి మాట.