షేక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ మిరుమిట్ల గౌను

0

మిల్కీ బ్యూటీ తమన్నా రెండు దశాబ్ధాల కెరీర్ బండిని నల్లేరుపై బండి నడకలా నడిపించడం ఆశ్చర్యం కలిగించేదే. కెరీర్ లో సక్సెస్ రేటు తక్కువ ఉండీ ఇంత పెద్ద స్థాయికి ఎదిగడం ఒక రకంగా అభిమానులకు షాకిచ్చేదే.

చిరంజీవి సరసన సైరా – నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించి మెప్పించింది. ప్రభాస్ సరసన బాహుబలిలోనూ ఆడిపాడింది. ఇలాంటి రేర్ ఛాయిస్ ఎవరికీ కుదరదేమో. ఇకపోతే ఇటీవలే కోవిడ్ పాజిటివ్ అని తేలాక తమన్నా చికిత్సతో కోలుకుంది. వైద్య నిపుణుల సంరక్షణలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యింది. ప్రస్తుతం పూర్తిగా కెరీర్ పైనే ఈ అమ్మడు దృష్టి సారించింది. గోపిచంద్ సరసన సీటీమార్ సహా `లవ్ మోక్ టైల్` రీమేక్ `గుర్తుందా శీతాకాలం`.. అంధాధున్ తెలుగు రీమేక్ తమన్నా క్యూలో ఉన్నాయి. `ది నవంబర్ స్టోరీ` తమిళ వెబ్ సినిమా చేస్తోంది. ఈ ప్రాజెక్టులపై ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నానని ఇంతకుముందు చెప్పింది.

తాజాగా తమన్నా స్పీక్స్ ఇన్ స్టాలో లేటెస్ట్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. తమన్నా మిరుమిట్లు గొలిపే పర్పుల్ డిజైనర్ డ్రెస్ లో మతి చెడగొడుతోంది. ఈ సంవత్సరం నా ఉత్సవాలు ఇదిగో ఇలా. అవన్నీ గ్లామర్ ఎలివేషన్ తోనే.. నా కుటుంబంతో సన్నిహిత క్షణాలు గడపడం. పండుగ వాతావరణంతో నా వేడుకలను ఎన్నడూ లేనంతగా ప్రకాశవంతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలిపింది. ఇక సామాజిక మాధ్యమాల్లో ప్రచారం పరంగానూ తమన్నా బాగానే ఆర్జిస్తోందని తాజా పోస్టింగ్ చూస్తే అర్థమవుతోంది. తమన్నా ఫ్యాన్స్ పేజీల్లో భారీగానే ప్రకటనలు కనిపిస్తున్నాయి మరి.