కమల్ బర్త్ డేకి ‘భారతీయుడు 2’ టీజర్ ట్రీట్ ఉందా?

0

సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే దర్శకుడు ఎన్నో జిమ్మిక్కులు చేయాలి. సినిమా మొదలు పెట్టకముందే తమ సినిమా గురించి మాట్లాడుకోవాలని బజ్ క్రియేట్ అవ్వాలని చూస్తుంటారు. అందు కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు. ప్రస్తుతం కమల్ టీమ్ అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కార్తీతో `ఖైదీ` వంటి సంచలన చిత్రాన్ని అందించి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా దక్షిణాదిలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు లోకేష్ కనకరాజ్.

ఆయన ప్రస్తుతం విశ్వనటుడు కమల్హాసన్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ని వదిలారు. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. అప్పుడే ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తోందిట.

నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదేంటి సినిమా స్టార్టే కాలేదు.. ముందే టీజర్ ఎలా? అంటూ అంతా అవాక్కవుతున్నారట. ఈ మూవీకి సంబంధించి ట్రయల్ షూట్ ని ఇప్పటికే పూర్తి చేశారు. అందులో టీజర్ కి కావాల్సిన సీన్స్ ని కట్ చేశారట. ఆ సీన్ లతో టీజర్ ని ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇదే రోజు `ఇండియన్ 2` టీజర్ ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కుదురుతుందా? లేదా అన్నది సస్పెన్స్ ఇప్పటికి.