పుస్తకాల పురుగులా చివరికిలా మారిన సీనియర్ హీరోయిన్

0

సోనాలి బెంద్రే గురించి పరిచయం అవసరం లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మెగాస్టార్ సరసన మురారిలో మహేష్ సరసన నటించింది. తెలుగులో అగ్ర కథానాయిక హోదాని ఆస్వాధించిన బాలీవుడ్ నటిగా సుపరిచితం. ఇక సోనాలి క్యాన్సర్ మహమ్మారీ నుంచి బయటపడిన సంగతి తెలిసినదే.

చాలా కాలంగా సోనాలి సినిమాలకు దూరంగానే ఉండిపోయింది దీనివల్ల. ఇక సోనాలి ఇతర ఆసక్తులేవీ? అంటే.. ఇదిగో ఇలాంటి క్రియేటివ్ థింగ్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ షర్ట్ పై `ప్రతి వేసవికి ఒక కొత్త కథ ఉంటుంది` అంటూ ఆసక్తికర క్యాప్షన్ నే ఇచ్చింది. ఇక సోనాలి పుస్తకాల పురుగు అన్న విషయం తెలిసినది తక్కువ మందికే. తనో రైటర్ కూడా.

ప్రతిసారీ తాను చదువుతున్న పుస్తకాల గురించి తరచుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంది. ఈ నటి 2018 లో క్యాన్సర్ కు చికిత్స చేయించుకునేప్పుడు ఎంతో ధైర్యంగా ఆ సన్నివేశాన్ని ఎదుర్కొంది. ఇన్ స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోవర్స్ ని ప్రేరేపించే పోస్ట్ లను తరచుగా పంచుకుంటుంది. ఈ లాక్ డౌన్ సమయంలో సోనాలి మనలో చాలామందిని ఆలోచింపజేసేలా సవాల్ విసిరింది. ఆమె తన లైబ్రరీలోని అన్ని పుస్తకాలను చదవాలని అనుకుంటోందిట.

బుక్ లవర్ గా సోనాలి బెంద్రే బుక్ క్లబ్ నే ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితం… సోనాలి తాను చదువుతున్న పుస్తకం గురించి చెప్పింది. “ఆన్ ఎర్త్ వి ఆర్ బ్రీఫ్లీ గార్జియస్ బై ఓషన్ వువాంగ్“ గురించి ఒక గమనికను సోనాలి రివీల్ చేసింది. తన చేతిలో ఉన్న పుస్తకంతో ఒక చిత్రాన్ని పంచుకుంటూ ఆమె ఇలా వ్రాసింది… “కొన్నిసార్లు పుస్తకం చదివేటప్పుడు గమ్యం గురించి అంతగా చెప్పలేం. అది ప్రయాణం గురించి.. ఇది చదివే విధానం. కొన్ని పుస్తకాలు చాలా అందంగా రాశారు. పుస్తకంతో కూర్చోవడం గట్టిగా కౌగిలించుకోవడం… కొన్ని పంక్తులను మళ్లీ చదవడం .. ఈ ప్రక్రియను ఆనందించడం పూర్తి ఆనందంగా ఉంటుంది. అవార్డు గెలుచుకున్న వియత్నామీస్ అమెరికన్ కవి ఓషన్ వువాంగ్ రాసిన ‘ఆన్ ఎర్త్ వి బ్రీఫ్లీ గార్జియస్’ అటువంటి పుస్తకం” అంటూ వెల్లడించింది. “ఈ పుస్తకం ఒక కొడుకు నుండి చదవురాని తల్లికి రాసిన లేఖ.. కుటుంబ చరిత్ర.. జాతి… తరగతి .. మనుగడను అన్వేషిస్తుంది” అని చాలా సంగతులే తెలిపింది. సోనాలి బెంద్రే బాలీవుడ్లో హమ్ సాథ్ సాథ్ హై- హమ్సే బాద్కర్ కౌన్ – హమారా దిల్ ఆప్కే పాస్ హై వంటి విజయవంతమైన చిత్రాలతో తన పేరును చాటుకున్నారు.