‘వి’ సినిమాని ఓటీటీ రిలీజ్ చేయడానికి అసలు కారణం అదేనా…?

0

నేచులర్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా నాని నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వి’ సినిమాని ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో ‘వి’ విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే మంచి డీల్ కుదరడంతో ఆ న్యూస్ నిజం చేస్తూ ‘వి’ మూవీని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉండగా నాని స్టార్ డమ్ పేరు చెప్పుకొని ఫ్యాన్సీ ఆఫర్ కి ఓటీటీకి అమ్మిన ‘వి’ సినిమాలో నాని కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేశాడని టాక్ వినిపిస్తోంది. రీసెంటుగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారని తెలుస్తోంది. సెన్సార్ అయినప్పటి నుంచి ‘వి’ స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. తన భార్యను హతమార్చిన వారిని చంపుతూ.. అక్కడ ‘వి’ అనే మార్కును నాని వదిలి వెళుతుంటాడని.. ఈ కేసును చేధించే బాధ్యతలు సుధీర్ బాబు తీసుకొని చివరకు నాని ని పట్టుకుంటారని ఓ స్టోరీ చెప్తోంది. అయితే దిల్ రాజ్ కూతురు ఇంస్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేసిన ‘వి’ ఇంటర్వెల్ స్నాప్ ని బట్టి మరో స్టోరీ అల్లేశారు. పోలీసుగా ఉన్న సుధీర్ బాబు మెయిన్ విలన్ అని.. నాని ని విలన్ అని చూపించినప్పటికీ ఇంటర్వెల్ లో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుందని అంటున్నారు.

ఏదేమైనా ‘వి’ లో నాని సినిమా మొత్తం మీద కేవలం 25 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని అంటున్నారు. అయితే మేకర్స్ మాత్రం నాని ‘వి’ అంటూ పాపం అమెజాన్ వారికి అంటగట్టారని.. ‘వి’ సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి అసలు కారణం ఇదేనని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ‘వి’ మేకర్స్ ఇప్పటి వరకు మాయ చేసారా.. అమెజాన్ ప్రైమ్ వారు మోసపోయారని వస్తున్న కామెంట్స్ నిజమా కాదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే.