స్వరకర్త సోదరుడిపై స్టార్ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఫైరింగ్

0

సోషల్ మీడియా యుగంలో ఒకరినొకరు తిట్టుకోవడం పరుష పదజాలం ఉపయోగించడం పరాకాష్టకు చేరుకుంటోంది. ఇటీవల పలు ఇన్సిడెంట్స్ లో సైబర్ క్రైమ్ అరెస్టులు సంచలనం అయ్యాయి. తాజాగా ఇలాంటిదే మరో సన్నివేశం అంతర్జాలంలో హీట్ పెంచుతోంది.

గత రెండు రోజులుగా `బుట్ట బొమ్మ` గాయకుడు అర్మాన్ మాలిక్ సోదరుడు అమల్ మాలిక్ పై సల్మాన్ ఖాన్ అభిమానులు ట్విట్టర్ వార్ నడిపిస్తున్నారు. షారూఖ్ ఖాన్ తన అభిమాన నటుడు!! అని అమల్ స్వయంగా సల్మాన్ అభిమానితో చెప్పడంతో రచ్చ ప్రారంభమైంది. అమల్ ని తిడుతూ సల్మాన్ అభిమానులు ట్విట్టర్ లో వార్ నడిస్తున్నారు.

అమల్ అసందర్భంగా ఇచ్చిన ఆ సమాధానం సల్మాన్ అభిమానులను చిర్రెత్తించిందనే చెప్పాలి. అమల్ కి సల్మాన్ తో ఇదివరకూ అనుబంధం ఉంది. చాలా సంవత్సరాల క్రితం `జై హో`తో సల్మాన్ కి సన్నిహితుడైనా ఇప్పుడిలా అనడాన్ని ఫ్యాన్స్ ఎవరూ ఊహించలేదు. సల్మాన్ అభిమానులు మరోసారి అమల్ పై యుద్ధం మొదలు పెట్టడంతో అది కాస్తా బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఎలాంటి ప్రమాదానికి దారి తీయనుందో? అంటూ భయం వ్యక్తమవుతోంది.