Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘రెడ్’ ట్రైలర్: డ్యూయల్ రోల్ లో అదరగొట్టిన రామ్..!

‘రెడ్’ ట్రైలర్: డ్యూయల్ రోల్ లో అదరగొట్టిన రామ్..!


టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషించిన తాజా చిత్రం ”రెడ్”. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. ఇందులో రామ్ సరసన మాళవిక శర్మ – నివేథ పేతురాజ్ – అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. లాక్ డౌన్ కు ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అవుతుండటంతో ‘రెడ్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు గురువారం ఈ చిత్ర ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘రెడ్’ ట్రైలర్ చూస్తుంటే రామ్ నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అవన్నీ ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఒక అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ అయ్యాక తను మనకు కరెక్టా కదా అనే డెసిషన్ వస్తాం.. లేదా డెసిషన్ తీసుకోడానికి ట్రావెల్ అవుతాం..’ అంటూ ఈ ట్రైలర్ ప్రారంభమైనది. ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు అన్నదమ్ముల చర్యలు వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించాయన్నది ఇందులో చూపించారు. రామ్ ఒక క్యారక్టర్ లో సాఫ్ట్ గా కనిపిస్తుండగా మరో క్యారక్టర్ లో వైలెంట్ గా కనిపిస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ కి మించి ఇందులో రామ్ యాక్టింగ్ ఉండబోతోందని తెలుస్తోంది. నివేథ పేతురాజ్ మర్డర్ మిస్టరీని చేధించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ నేపథ్య సంగీతం కూడా అదరగొట్టినట్లు అర్థం అవుతోంది. ఇందులో పోసాని – సోనియా అగర్వాల్ – సత్య – వెన్నెల కిశోర్ – సంపత్ – కోట శ్రీనివాస్ తదితరులు నటించారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘తడమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రామ్ ‘రెడ్’ సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజ్ కానుంది.