ఆ ఇద్దరు నటీమణులకు అండర్ వరల్డ్ తో రిలేషన్!

0

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య ఎపిసోడ్ లో డ్రగ్స్ కోణం బయటకు వచ్చి జాతీయ స్థాయిలో రచ్చ రచ్చగా మారటం తెలిసిందే. బడా హీరోయిన్లకు సైతం ఈ డ్రగ్ ఎపిసోడ్ లో లింకులు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలా సాగుతున్న వేళ.. శాండల్ వుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం వేగంగా ముందుకు వెళుతోంది. విచారణలో భాగంగా ఇద్దరు ప్రముఖ నటీమణుల్ని అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించటం సంచలనంగా మారింది.

రాగిణి ద్వివేది.. సంజనా గల్రానిలను పరస్పన జైలులో ఉంచారు. వారిని ఈడీ అధికారులు కొద్దిరోజులుగా విచారిస్తున్నారు. ఈ సందర్భంగా రాగిణి.. సంజనల ఆస్తులు ఎంతన్న లెక్కతో పాటు.. వారికి డ్రగ్ మాఫియాతో ఉన్న లింకుల లెక్క తేల్చే పనిలో పడట్లు చెబుతున్నారు. తాజాగా జరిపిన విచారణలో.. వారికి అండర్ వరల్డ్ డాన్ లతో పాటు.. రౌడీలతోనూ సంబంధాలు ఉన్నట్లుగా తేలినట్లుగా తెలుస్తోంది.

నటి సంజనతో పోలిస్తే.. రాగిణి ద్వివేది పైనే అధికారులు ఎక్కువ అనుమానాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా కీలక సమాచారాన్ని సేకరించిన అధికారులు.. వారిద్దరిని మరికొన్ని రోజులు విచారణ జరపాలని భావిస్తున్నారు. డ్రగ్ డొంక కదల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. విచారణ సందర్భంగా నటి సంజన పలుమార్లు ఆవేదనతో విలపించినట్లుగా తెలుస్తోంది.

ఎన్ని సినిమాల్లో నటించారు? ఎంత సంపాదించారు? ఆమె ఆస్తుల్లో తండ్రి నుంచి వచ్చిన ఆస్తి ఎంత? అన్న లెక్కల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. పలు భాషల్లో తాను 42 సినిమాల్లో నటించినట్లుగా సంజన తెలిపారు. అయితే.. సినిమాలతో ఆమె ఎక్కువ సంపాదించలేదన్న విషయాన్ని గుర్తించారు. అలాంటప్పుడు.. ఇంత భారీగా ఆస్తులు ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ చేస్తున్నారు. వీరిద్దరు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసినా.. మరో కేసులో వీరిని అదుపులోకి తీసుకోవాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా.. రాగిణి.. సంజనలు ఇద్దరు డ్రగ్ కేసులో పూర్తిగా కూరుకుపోయినట్లుగా చెబుతున్నారు. అధికారిక సమాచారం మరెలా ఉంటుందో చూడాలి.