పెళ్లికి రెడీ అయిన మెగా హీరో.. అమ్మాయి ఎవరో మరి…!

0

‘నో పెళ్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి’ అంటూ కరోనా డేస్ లో పాడుకుంటూ వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రూట్ మార్చాడని తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా – నితిన్ – నిఖిల్ సిద్ధార్థ్ లు ఇప్పటికే ఓ ఇంటివారయ్యారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ క్రమంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఇన్నాళ్లు ‘సోలో బతుకే సో బెటర్’ అని చెప్తూ వచ్చిన తేజ్ రీసెంట్ గా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కాగా సాయి ధరమ్ తేజ్ ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన తమ దగ్గరి బంధువుల అమ్మాయిని తేజ్ తో వివాహం చేయనున్నారట. ఇప్పటికే అమ్మాయిని చూసిన తేజ్ తల్లి.. ఈ సంబంధం గురించి మేనమామ మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారని.. ఈ సంబంధానికి చిరు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సరైన ముహుర్తం కుదరకపోడంతో 2021 సమ్మర్ లో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వుండే అవకాశం వుందని తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే ఏడాది 33 ఏళ్ళ ధరమ్ తేజ్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నాడు.