Templates by BIGtheme NET
Home >> Cinema News >> మహేష్ కు వదినగా రేణు దేశాయ్.. నేను చెప్పేంత వరకు నమ్మకండి

మహేష్ కు వదినగా రేణు దేశాయ్.. నేను చెప్పేంత వరకు నమ్మకండి


సూపర్ స్టార్ మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబోలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక మూవీ సర్కారు వారి పాట షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి రెండు వారాల్లో షూటింగ్ ను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సమయంలోనే సర్కారు వారి పాట సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొదట మహేష్ సోదరి పాత్రలో ఆమె కనిపించబోతుంది అన్నారు. ఆ తర్వాత వదినగా రేణు దేశాయ్ నటిస్తుంది అంటూ ప్రచారం జరిగింది. మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్ అంటూ వార్తలు రావడంతో అంతా కూడా చాలా ఆసక్తిగా అప్ డేట్ కోసం ఎదురు చూశారు. గత కొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

రేణు దేశాయ్ స్పందిస్తూ.. తాను నిజంగా సర్కారు వారి పాట సినిమాలో నటించడం లేదు. నేను ఏ ప్రకటన చేయాలనుకున్నా నాకు సంబంధించిన సినిమా ఏదైనా కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా సమాచారం ఇస్తాను. ఎప్పుడైతే నేను సమాచారం ఇస్తానో అప్పుడే నమ్మండి. అంతే తప్ప మీడియాలో వచ్చిన ప్రతి ప్రచారంను దయచేసి నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు రేణు ప్రకటనతో క్లారిటీ వచ్చింది. గతంలో నటించేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా రేణు ప్రకటించింది. కాని ఇప్పటి వరకు ఆమెను స్టార్ ల సినిమాల కోసం సంప్రదించిన దాఖలాలు కనిపించడం లేదు అనేది మీడియా వర్గాల సమాచారం. ఒక వేళ స్టార్ హీరోల సినిమాలకు సంప్రదిస్తే మంచి పాత్రను ఆఫర్ చేస్తే తప్పకుండా ఆమె ఓకే చెప్పే అవకాశం ఉందంట.