Templates by BIGtheme NET
Home >> Cinema News >> శంకుతలగా సమంత.. దుష్యంతుడు ఎవరు?

శంకుతలగా సమంత.. దుష్యంతుడు ఎవరు?


కమర్షియల్ సినిమాలకు కూడా తనదైన కళాత్మకతను జోడించి అద్భుతమైన కళాఖండాలను ఆవిష్కరించగల నేర్పరి దర్శకుడు గుణశేఖర్. గతంలో ఆయన రుద్రమదేవి చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత తీయబోయే సినిమా కూడా పౌరాణిక చిత్రమే కావడం విశేషం. గుణశేఖర్ లేటెస్ట్ మూవీ ‘శాంకుతలం’.

పురాన ప్రేమకథ అయిన శకుంతల-దుష్యంతుడి లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నాడు ఈ దర్శకనిర్మాత. అయితే.. ఈ మూవీలో శకుంతల పాత్ర కోసం పలువురు హీరోయిన్లను సంప్రదించాడు గుణశేఖర్. చివరకు సమంత ఓకే అయ్యింది. సమంత లాంటి నటి శకుంతల పాత్రలోకి రావడంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

అయితే.. ఈ ‘శాకుంతలం’ సినిమా ప్రకటించడానికి ముందు రానా దగ్గుబాటితో ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు గుణశేఖర్. అది కూడా పౌరాణిక చిత్రమే కావడం గమనార్హం. ‘హిరణ్యకశ్యప’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. కానీ.. ఏమైందో తెలియదు ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చి ఈ అందమైన ప్రేమ కావ్యాన్ని ఫ్రేమ్ లోకి తెచ్చాడు దర్శకుడు.

ఈ క్రమంలోనే ‘శాకుంతలం’ సినిమా ప్రకటించడం.. టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగిపోయాయి. ‘‘వెండితెరపై ‘హిరణ్య కశ్యప’లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ..” అని మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు గుణశేఖర్.

ఈ సినిమాలో ‘శాకుంతల’గా సమంతను ఫైనల్ చేయడంతో ఇప్పుడు అందరి దృష్టీ.. రాజు దుష్యంతుడిపైనే పడింది. శకుంతల ప్రేమికుడు దుష్యంతుని పాత్రలో నటించబోయే ఆ నటుడు ఎవరా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అయితే.. ఈ సినిమాను పాన్ ఇండియన్ మూవీగా మలచాలని భావిస్తున్న గుణశేఖర్.. మలయాళం లేదా తమిళ హీరోను దుష్యంతుడి పాత్రకు తీసుకోవాలని చూస్తున్నాడట. మరి ఆ కింగ్ ఎవరనేది త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది. కాగా.. గుణశేఖర్ కుమార్తె నీలిమాగుణ ఈ సినిమాతో నిర్మాతగా మారుతోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ చిత్రానికి సౌండ్ కంపోజ్ చేస్తున్నారు.