Templates by BIGtheme NET
Home >> Cinema News >> నయన్ – విఘ్నేష్ సమర్పిస్తున్న మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ ‘రాకీ’ టీజర్..!

నయన్ – విఘ్నేష్ సమర్పిస్తున్న మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ ‘రాకీ’ టీజర్..!


కోలీవుడ్ హాట్ కపుల్స్ నయన తార – విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన వీరు.. ఇప్పుడు ”రాకీ” అనే తమిళ్ మూవీ నిర్మాణంతో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ‘తారామణి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వసంత్ రవి ‘రాకీ’ చిత్రంలో లీడ్ రోల్ పోషించాడు. వెటరన్ ఫిలిం మేకర్ భారతీరాజా – రోహిణి – రవీనా రవి ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. అరుణ్ మధేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘రాకీ’ టీజర్ చూస్తుంటే ఇదొక రివేంజ్ యాక్షన్ డ్రామా అని అర్థం అవుతోంది. ‘మనిషి అనేవాడు అత్యంత క్రూరమైన జంతువు’ అని పేర్కొంటూ వచ్చిన ఈ టీజర్ మోస్ట్ వైలెంట్ గా ఉంది. ఇందులో భారతీరాజా చూస్తుండగా.. వసంత్ రవి ఒక వ్యక్తి పీకని అతి కిరాతకంగా కోయడం చూపించారు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి పేగులని బయటకు తీసి అతని మెడలోనే వేయడం ద్వారా ఈ సినిమా ఎంత వైలెంట్ గా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ‘తూటా’ ఫేమ్ దర్బుక శివ మ్యూజిక్ అందించాడు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. నయన తార – విఘ్నేష్ శివన్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ ఏ స్టూడియోస్ బ్యానర్ పై మనోజ్ కుమార్ నిర్మించారు. ‘రాకీ’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.