Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ సింగ్ పై బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..!

సుశాంత్ సింగ్ పై బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..!


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఇంకా దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ ప్రియురాలు హీరోయిన్ రియా చక్రవర్తి.. సుశాంత్ సింగ్ సోదరీమణులు ప్రియాంక సింగ్ – మీతూ సింగ్ ఇద్దరూ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే అతడికి మందులు ఇచ్చారని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరారు. అయితే ప్రియాంక సింగ్ – మీతూ సింగ్ తమపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ ఎస్ఎస్ షిండే నేతృత్వంలోని ధర్మాసనం దిగంగత సుశాంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎస్ షిండే ఈ సందర్భంగా ”కేసు ఏదైనా కానివ్వండి.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముఖం చూస్తే అతడు అమాయకుడు హుందాగా వ్యవహరించేవాడనే విషయం అర్థమవుతుంది. ఎంఎస్ ధోని సినిమాలో తన నటన చూసి ప్రతి ఒక్కరు అతడిని ఇష్టపడ్డారు” అని వ్యాఖ్యానించారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గతేడాది జూన్ 14న ముంబైలోని తన నివాసంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో దీనిని అనుమానాస్పద మృతిగా భావించి కేంద్రం సీబీఐకి అప్పగించింది. అదే సమయంలో ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఎన్సీబీ అనేక మందిని విచారించడంతో పాటు పలువురిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్ట్ ఆయన రియా చక్రవర్తి మరియు ఆమె తమ్ముడు జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదల అయ్యారు.