Templates by BIGtheme NET
Home >> Cinema News >> నేను ఎక్కడున్నానో చెప్పుకోవాలోచ్ : రకుల్

నేను ఎక్కడున్నానో చెప్పుకోవాలోచ్ : రకుల్


రకుల్ ప్రీత్ సింగ్ శరీర సౌష్టవాన్ని గమనిస్తే.. ఓ అద్భుతమైన చేతివాటం కలిగిన శిల్పి చెక్కిన శిల్పంలా కనిపిస్తుంది. మిస్ వరల్డ్ మెజర్ మెంట్స్ 34-26-34 స్ట్రక్చర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది ఈ భామ. అయితే.. ఇదంతా ఊరికే వచ్చిన షేప్ కాదు. దీనివెనుక ఎంతో శ్రమ అంతకు మించిన పట్టుదల ఉన్నాాయి.

మార్నింగ్ మార్నింగే జిమ్ లో కసరత్తులు చేసే ఈ అమ్మడు.. ఆ తర్వాత యోగాసనాాలు వేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామానికి గ్యాప్ ఇవ్వదు. షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. బాడీ ఎక్సర్ సైజ్ కు మాత్రం బ్రేక్ ఇవ్వదు ఈ బ్యూటీ. ఎక్కడ ఉన్నా.. ఆసనాలు మాత్రం వేసి తీరుతుంది. ఇందుకు సంబంధించిన ఓ లేటెస్ట్ పిక్ ను అభిమానులతో పంచుకుంది రకుల్.

అయితే.. గతంలోనూ తన ఫిట్ నెస్ ఫొటోలు యోగా పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. కానీ.. ఈ సారి పోస్ట్ చేసిన ఇమేజ్ మాత్రం.. చూసే వారితో ‘ఔరా’ అనిపిస్తోంది. ఈ లెటెస్ట్ పిక్.. గత చిత్రాలను ఓవర్ టేక్ చేసింది. యెగాసనాల్లో మోస్ట్ పవర్ ఫుల్ ‘హలాసనం’ వేసి ఆశ్చర్యపరిచింది రకుల్. ఈ ఫొటో చూసిన అందరూ.. రకుల్ ఫ్లెక్సిబుల్ బాడీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫొటోను పోస్ట్ చేసిన రకుల్.. “నేను ఎక్కడ ఉన్నాను?” అంటూ కోట్ యాడ్ చేసింది.

ఇక రకుల్ సినిమాల గురించి చూస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరో అజయ్ దేవ్ గన్ సరసన ‘మేడే’ చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత దర్శకుడు ఇంద్ర కుమార్ “థాంక్ గాడ్” పేరుతో తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో కూడా అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈనెల 21నుంచి మొదలుకానుంది. సిద్దార్థ్ మల్హోత్రా కూడా నటిస్తున్న ఈ సినిమాను టీ-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.