అయోమయంలో ‘ఆర్.ఆర్.ఆర్’ మేకర్స్..?

0

దర్శకధీరుడు రాజమౌళి చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా.. తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా ‘ఆర్.ఆర్.ఆర్’ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి’ ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచిన ‘బాహుబలి’.. విదేశాల్లో సైతం సత్తా చాటింది. అయితే ఇప్పుడు రాజమౌళి నుంచి వస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఆ స్థాయిలో బిజినెస్ జరగడం లేదట. దీనికి ప్రధాన కారణం కరోనా ఎఫెక్ట్ అయితే మరో కారణం హీరోలకు ఇతర ఇండస్ట్రీలలో పెద్దగా క్రేజ్ లేకపోవడమే అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. తారక్ – చరణ్ ఇద్దరికీ పాన్ ఇండియా వైడ్ యాక్సెప్టెన్సీ లేకపోవడంతో తెలుగులో తప్పిస్తే మిగతా భాషల్లో ట్రిపుల్ ఆర్ టీమ్ కి బిజెనెస్ ఆఫర్స్ ఆచినంత స్థాయిలో రావడం లేదట. అయితే ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్నాయి. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చే ఏడాది సమ్మర్ తరువాత కానీ విడుదల కాదు. కాబట్టి ఆ గ్యాప్ లో పూర్తి స్థాయిలో ‘ఆర్.ఆర్.ఆర్’ బిజినెస్ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.