భామలంతా మాల్దీవులకు.. హీరోలంతా దుబాయ్ కి!

0

మహమ్మారీ దెబ్బకు హీరోలంతా బ్లాక్ అయిపోయారు. సెలబ్రిటీలంతా సెల్ (చిన్నపాటి జైలు) లాంటి ఇండ్లలో లాకైపోయారు. ఏడెనిమిది నెలలుగా విదేశీ విహారాల్లేవ్.. స్వదేశీ బీచ్ విహారాల్లేవ్.. అసలు స్వేచ్ఛగా ఆరుబయట గాలి పీల్చుకునే అవకాశమే లేకుండా పోయింది. దీంతో అందరిలోనూ ఏదో తెలీని వెలితి.. ఎంటర్ టైన్ మెంట్ కోల్పోయిన భావన .. అంతకుమించి నిర్లిప్తత.. లేజీనెస్ అలుముకుంది. ఇప్పుడు ఆ ఫీలింగ్స్ అన్నిటినీ వదిలించుకుని నూతనోత్సాహంతో బరిలో దూకేందుకు సిద్ధమవుతూ.. అంతకు ముందే రిజోనవేషన్ ప్లాన్ చేస్తున్నారు. ఫుల్ గా రిలాక్స్ అయిపోవాలంటే విదేశీ బీచ్ లు.. విదేశీ షికార్లు అంటూ జోరుమీదున్నారు. భామలంతా మాల్దీవులకు వెళుతుంటే.. బావ(స్టార్ హీరో)లంతా దుబాయ్ వెళుతున్నారు.

ఇప్పటికే పలువురు కథానాయికలు విదేశీ ఒంటరి దీవుల్లో చిలౌట్ చేస్తున్నారు. కిచ్లుని పెళ్లాడాక కాజల్ మాల్దీవుల్లో సెలబ్రేషన్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఇండియా వైడ్ డజను పైగా హీరోయిన్లు మాల్దీవుల్లో చిలౌట్ చేస్తున్న ఫోటోలు వీడియోలు అంతర్జాలాన్ని షేక్ చేశాయి. పలువురు ఇంగ్లీష్ ట్రిప్ ప్లాన్ చేయడం ఆసక్తికరం. ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్.. బిపాస బసు.. సారా అలీఖాన్ .. మలైకా ఇలా పలువురు భామల చిలౌట్ ఫోటోలు అంతర్జాలాన్ని హీటెక్కించాయి.

టాలీవుడ్ వరకూ చూస్తే… సూపర్ స్టార్ మహేష్ ఇప్పటికే దుబాయ్ ట్రిప్ పూర్తి చేసుకుని ఇండియా వచ్చేస్తున్నారు. ఆయన ఇటొచ్చేస్తుంటే.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అటు వెళుతున్నారు. ఎన్.టీ.ఆర్ తన కుటుంబంతో కలిసి దుబాయ్ ట్రిప్ వెళుతున్నారు. తారక్.. అతని భార్య వారసులు చాలా కాలం తరువాత సెలవుదినాన్ని ఇలా ప్లాన్ చేశారట. రేయింబవళ్లు చలిలోనూ ఆర్.ఆర్.ఆర్ షూటింగుతో బిజీగా ఉన్న తారక్ రిలీఫ్ కోసం ఇలా ప్లాన్ చేశారు. తారక్ తర్వాత చరణ్ కూడా విదేశీ విహారానికి వెళ్లే ఛాన్సుందిట.

అంతకుముందు డార్లింగ్ ప్రభాస్ పలుమార్లు దుబాయ్ వేకేషన్ ని ఎంజాయ్ చేశారు. హీరోలు మాత్రం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లేందుకు ఆసక్తిని కనబరచడం ఆసక్తికరం. అలాగే ఒంటరి పక్షులన్నీ మాల్దీవుల విహారానికే ప్రాధాన్యతనివ్వడం ఆసక్తి రేకెత్తించే విషయమే.

స్టార్ హీరోలు ఎన్టీఆర్.. మహేష్ ఇప్పటికే క్రేజీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఒకసారి సెట్స్ లో జాయిన్ అయితే క్షణం తీరిక లేనంత బిజీ అయిపోతారు. అంతకు ముందే ఇలా విదేశీ విహారాలకు ప్లాన్ చేసారు. ఆ ఇద్దరు టాప్ స్టార్లు వరుసగా పలువురు దర్శకుల్ని లాక్ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు ఆ ఇద్దరు హీరోలు రెడీ అవుతున్న సంగతి తెలిసినదే.