పది సినిమాలు లైన్ లో పెట్టిన సూర్య..?

0

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ‘గజిని’ ‘సెవెంత్ సెన్స్’ ‘యముడు’ ‘సింగం’ ‘సింగం 2’ ‘బ్రదర్స్’ ’24’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఇటీవల సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడిపోతున్నాయి. వరుస ఫెయిల్యూర్స్ తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయిలో వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది. దీంతో తెలుగులో మళ్లీ సూర్య మార్కెట్ పుంజుకుంటోంది.

తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఇచ్చిన జోష్ లో సూర్య ఇప్పుడు చిన్న పెద్ద సినిమాలు కలిపి మొత్తం పది సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అందులో తాను హీరోగా నటించే సినిమాలు.. సతీమణి జ్యోతిక తో తీయబోయే సినిమాలు.. వేరే హీరోలతో చేసే సినిమాలు ఉంటాయని తెలుస్తోంది. సూర్య ‘2డి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ ఏర్పాటు చేసి ఇప్పటికే పలు సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని కూడా సూర్య స్వయంగా నిర్మించాడు. ఏదేమైనా వరుస ఫ్లాపులతో కోలుకోలేని స్థితికి వెళ్లిపోయిన సూర్యకు ఈ సినిమా పది సినిమాలు లైన్ లో పెట్టే కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు.