రామరాజుతో రాకింగ్ దీపావళి అదుర్స్

0

టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ .. మంచు కాంపౌండ్ మధ్య స్నేహానుబంధం గురించి తెలిసిందే. పండగలు పబ్బాల వేళ చిటపటలు ఛమత్కారాలు అభిమానులకు సుపరిచితమే. నేటితరం ఫ్యామిలీ హీరోలు వివాదాలకు తావివ్వకుండా సరదాగా కలిసి మెలిసి సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ సాంప్రదాయాన్ని మెగా – మంచు హీరోలు కొనసాగిస్తున్నారు.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు కార్యక్రమాల్లో సందడి చేశారు. సినీపెద్దలుగా టాలీవుడ్ కి దారి చూపిస్తున్నారు ఆ ఇద్దరూ. ఇక మంచు యువ హీరోలు విష్ణు.. మనోజ్.. ట్యాలెంటెడ్ నటి కం హోస్ట్ కం నిర్మాత మంచు లక్ష్మి .. చరణ్ కి ఎంతో క్లోజ్.. ఫ్యామిలీ ఫంక్షన్లు సహా ప్రతి వేడుకకు వీళ్లంతా కలిసి సెలబ్రేట్ చేస్తుంటారు.

మొన్న దీపావళి సంబరాన్ని రాకింగ్ స్టార్ మనోజ్ చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ తో దీపావళి సంబరాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోజ్.. లక్ష్మీ మంచుతో దీపావళి జరుపుకోవడంపై తన ఆనందాన్ని పంచుకున్నారు చరణ్. # సీతారామరాజు చరణ్ # మనోజ్ మంచు # లక్ష్మిమంచూ.. అంటూ హ్యాష్ ట్యాగ్ లతో చరణ్ ప్రత్యేకంగా తన సెలబ్రేషన్ ని హైలైట్ చేసారు. మొత్తానికి అల్లూరి సీతారామరాజుతో రాకింగ్ సెలబ్రేషన్ ఇది అని చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా మంచు మనోజ్ సొంతంగా బ్యానర్ ప్రారంభించి అందులో సినిమా చేస్తున్నారు. ఇది మనోజ్ కి కంబ్యాక్ సినిమా అనే చెప్పాలి.