Templates by BIGtheme NET
Home >> Cinema News >> సాహో సాంగ్స్ మేకింగ్ స్పెషల్

సాహో సాంగ్స్ మేకింగ్ స్పెషల్


2019 ఆద్యంతం ఆడియెన్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన చిత్రం సాహో. డార్లింగ్ ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తున్న సినిమాగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దీనిపై చర్చ సాగింది. 30 ఆగస్ట్ 2019 న రిలీజ్ తర్వాత సాహో మేకింగ్ పరంగా హాలీవుడ్ స్టాండార్డ్స్ కి ఏమాత్రం తగ్గలేదని క్రిటిక్స్ ప్రశంసించారు.

ఇక ఈ సినిమాలో ఉన్నవి రెండు మూడు పాటలే అయినా అవన్నీ వరల్డ్ క్లాస్ విజువల్స్ తో మెప్పించాయి. అయితే ఆ సాంగ్స్ ని అంత క్లాసీగా విజువల్ రిచ్ గా తెరకెక్కించడం వెనక టెక్నికల్ టీమ్ వర్క్ గురించి కానీ కొరియోగ్రాఫర్స్ శ్రమ గురించి కానీ ఎవరికైనా తెలుసా? అంటే.. ఇదిగో అందుకు సమాధానంగానే లేటెస్టుగా సాంగ్ మేకింగ్ పై వీడియోని యువిక్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేసింది.

ఈ మూవీలో పాటలను సరికొత్త లొకేషన్లలో అత్యంత భారీగా చిత్రీకరించారు. ఆస్ట్రియాలోని ఇన్స్ బ్రక్ లో చేసిన షూటింగ్ ను తాజా వీడియోలో చూపించారు. “ఇన్స్ బ్రక్ లో షూటింగ్ ఓ అద్భుత అనుభవం. అక్కడి వాతావరణం.. మంచి మనసున్న మనుషులు.. అద్భుత కట్టడాలు సూపర్భ్. మా షూటింగ్ ను విజయవంతం చేసినందుకు ఇన్స్ బ్రక్ కి ధన్యవాదాలు“ అని ప్రభాస్ అన్నారు.